బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్… ఇలా ఎక్కడ చూసినా బయోపిక్‌ల హవానే నడుస్తోంది. తాజాగా బాలీవుడ్ తెరపై మరో బయోపిక్ రాబోతోంది. మహిళా క్రికెట్ వరల్డ్‌లో ఎన్నో ఆటు పోట్లని ఎదుర్కొని జట్టు సారధిగా ఇండియన్ ఉమెన్ క్రికెట్‌లో తనదై ముద్ర వేసింది మిథాలీరాజ్. ఆమె జీవిత కథ ఆధారంగా హిందీలో రూపొందుతున్న చిత్రం `శభాష్ మిథూ`. తెలుగులో ప్రాధాన్యత తగ్గిపోవడంతో బాలీవుడ్ బాట పట్టిన తాప్సీ ఇందులో మిథాలీరాజ్ పాత్రలో నటించింది.
ప్రియ అవెన్ అందించిన ఈ కథకు రాహుల్ డోలాకియా దర్శకత్వం వహిస్తున్నారు. వయాకమ్ 18 పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధంచిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని బుధవారం హీరోయిన్ తాప్సీ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది.
క్రికెట్ జెర్సీలో బ్యాట్‌ని ఝుళిపిస్తున్నతాప్సీ లుక్ ఆకట్టుకుంటోంది. తలపై హాట్, మెడలో మూడు రుద్రాక్షలు ధరించి కనిపిస్తున్న తాప్సీ ముమ్మూర్తులా మిథాలీరాజ్‌ని దించేసింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
“I have always been asked who’s your favourite male cricketer but you should ask them who their favourite female cricketer is.” The statement that made every cricket lover pause n introspect that do they love the game or the gender playing it.@M_Raj03 you are a ‘Game Changer’ pic.twitter.com/2VlxYpXmSM
— taapsee pannu (@taapsee) January 29, 2020
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Rzi5a8
Comments
Post a Comment