పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన ఆల్‌టైమ్ హిట్ చిత్రం `తొలిప్రేమ`. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చి ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం కోసం దేవా అందించిన పాటలు ఇప్పటికీ చెవుల్లో మారుమ్రోగుతూనే వున్నాయి. ఈ సినిమా కోసం పవన్‌పై సాగర తీరంలో `గగనానికి హృదయం ఒకటే.. కెరటాలకి సంద్రం ఒకటే.. అంటూ సాగే పాటని చిత్రీకరించారు. తాజ్‌మహల్ సెట్ ఈ పాటకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
మళ్లీ ఇన్నేళ్ల తరువాత పవన్ కోసం మరోసారి తాజ్‌మహల్ సెట్‌ని నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ ఓ పిరియాడికల్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
రెగ్యులర్ షూటింగ్ ని ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టబోతున్నారు. అవుట్ డోర్ షూటింగ్ తక్కువగా చేయాలని అత్యధిక భాగం సెట్‌లలోనే పూర్తి చేయాలని భావించిన క్రిష్ ఇందు కోసం తాజ్‌మహల్, చార్మినార్ సెట్‌లని సిద్ధం చేయించినట్టు తెలిసింది. ఇప్పటికే దాదాపు పూర్తయిన ఈ సెట్‌లలో కీలక సన్నివేశాలు, పాటల్ని పూర్తి చేస్తారట. `పింక్` రీమేక్‌లో నటిస్తున్న పవన్ మధ్య గ్యాప్‌లో క్రిష్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని, అందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తియినట్టు చిత్ర వర్గాల సమాచారం.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3aTOujg
Comments
Post a Comment