90వ దశకంలో ప్రేమ గీతాలతో యువ హృదయాలని ఓలలాడించారు సీనియర్ గాయని అనురాధా పౌడ్వాల్. 90లో వచ్చి ఎన్నో ప్రేమకథ చిత్రాల్లో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే మిగిలిపోయాయి. బాలీవుడ్ సినిమాకు ఆమె చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆమెని పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా జాతీయ పురస్కారాన్ని సైతం సొంతం చేసుకున్నారామె. అలాంటి గాయనిపై కేరళ తిరువనంతపురంకు చెందిన కార్మలా మోండెక్స్ అనే మహిళ 50 కోట్ల పరువు నష్టం దావాని వేయడం కలకలం రేపుతోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.డి. బర్మన్ వద్ద కంపోజర్‌గా వర్క్ చేసిన అరుణ్ పౌడ్వాల్‌ని అనురాధా పౌడ్వాల్ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ అబ్బాయి ఆదిత్య, ఓ అమ్మాయి కవిత ఉన్నారు. అయితే అనురాధకు తానే తొలి సంతానం అని, తనని ఓ మిలటరీ కుటుంబానికి చిన్నతనంలోనే దత్తత ఇచ్చేశారని, ఇప్పుడు నాకు 50 కోట్లు కాంపెన్ సెషన్‌గా ఇవ్వాలని కార్మలా మోండెక్స్ కోర్టు కెక్కింది. ప్రస్తుతం ఈ కేసు అనురాధా పౌడ్వాల్ కుటుంబంలో కలకలం సృష్టిస్తోంది.
ఈ విషయంపై అనురాధా పౌడ్వాల్‌మాత్రం స్పందించడానికి నిరాకరిస్తున్నారట. కమల ఓ ఇడియట్‌లా మాట్లాడుతోందని, ఆమె మాటలపై స్పందించాల్సిన అవసరం లేదని వెల్లడించినట్టు చెబుతున్నారు. కార్మలా మోండెక్స్ మాత్రం కావాలంటే డీఎన్ఏ టెస్ట్ చేసుకోండి అందుకు నేను సిద్ధమే అంటోంది. దీనిపై అనురాధా పౌడ్వాల్ కుటుంబం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ప్రచారం జరుగుతోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QiHxjF
Comments
Post a Comment