సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ దర్బార్ జనవరి 9న విడుదలైన సంగతి తెల్సిందే. మొదటి రెండు రోజుల్లోనూ సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోయిన దర్బార్ మూడో రోజు నుండి బాగా నెమ్మదించింది. ఎందుకంటే జనవరి 11న సరిలేరు నీకెవ్వరు విడుదలవ్వడం, జనవరి 12న అల వైకుంఠపురములో ప్రేక్షకుల ముందుకు రావడంతో దర్బార్ చాలా థియేటర్లను కోల్పోవాల్సి వచ్చింది.
అయినా కానీ దర్బార్ డీసెంట్ కలెక్షన్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆరు రోజులకు గాను దర్బార్ 8.36 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 14.5 కోట్ల బిజినెస్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఆరు కోట్లు వసూలు చేయడం అనేది చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. అయితే సంక్రాంతి పండగ అడ్వాంటేజ్ తో దర్బార్ 10 కోట్ల షేర్ సాధించేలా కనిపిస్తుంది.
దర్బార్ సినిమా 6 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ఇక్కడ చూద్దాం:
నైజాం :Rs 4.19 Cr
సీడెడ్ : Rs 0.97 Cr
గుంటూరు : Rs 0.62 Cr
వైజాగ్: Rs 0.88 Cr
ఈస్ట్ : Rs 0.55 Cr
వెస్ట్ : Rs 0.37 Cr
నెల్లూరు : Rs 0.33 Cr
కృష్ణ : Rs 0.45 Cr
ఆంధ్ర + తెలంగాణ : Rs 8.36 Cr Shares
రజినీకాంత్ ఈ చిత్రంలో ముంబై సిటీ పోలీస్ కమిషినర్ గా కనిపించిన సంగతి తెల్సిందే. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TrgzbG
Comments
Post a Comment