సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వచ్చేసింది. దీంతో సినిమాకు ఉన్న అవరోధాలు అన్నీ క్లియర్ అయిపోయినట్లే. ఈ సినిమాకు కట్స్ ఏమీ విధించకుండా యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఫైట్స్ ఉండడంతో యూ నుండి యూ/ఏ కు వెళ్లారు. ఏదేమైనా సినిమా పట్ల సెన్సార్ సభ్యుల స్పందన బాగుందని టాక్ వినిపిస్తోంది. పండక్కి సరైన బొమ్మను దించుతున్నారని సభ్యులు దర్శకుడ్ని అభినందించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
ముందు నుండీ సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రమోషన్స్ విషయంలో కానీ మరెందులోనైనా కానీ పక్కా ప్రణాళికతో వెళుతున్నారు. షూటింగ్ ను కూడా చాలా త్వరగా ముగించేశారు. సెన్సార్ కూడా 9 రోజుల ముందర చేయడంతో ఇక రిలీజ్ కు సర్వం సిద్ధమైపోయినట్లే. ఓవర్సీస్ లో మహేష్ కు మంచి మార్కెట్ ఉండడంతో ఆ దిశగా అక్కడ పక్కా ప్లానింగ్ ఉండాలి. ఈ నేపథ్యంలో ముందే అక్కడికి డ్రైవ్స్ పంపించాలి. అందుకే లాస్ట్ మినిట్ టెన్షన్స్ ఉండకుండా సెన్సార్ క్లియరెన్స్ తెచ్చేసుకున్నారు.
ఇక ఈ సినిమాలో పలు హైలైట్స్ ఉన్నట్లు లీక్స్ అందాయి. సినిమా ఆద్యంతం మహేష్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్మీ మేజర్ పాత్రలో కూడా మహేష్ మెస్మరైజ్ చేస్తాడని అంటున్నారు. ఇక డ్యాన్స్ లు కూడా ఎనెర్జిటిక్ గా వేసాడని, ఫ్యాన్స్ వరకూ సినిమా ఫుల్ మీల్స్ అందిస్తుందని తెలుస్తోంది. మహేష్ ను పక్కన పెడితే ఇందులో కమెడియన్ సత్య ట్రాక్, రష్మికతో మహేష్ ట్రైన్ లో లవ్ ట్రాక్, అరగంట పాటు ట్రైన్ కామెడీ సీన్, ఫారెస్ట్ ఫైట్ సీన్, మైండ్ బ్లాక్ సాంగ్ ఇలా చాలానే స్పెషలిటీస్ ఉన్నాయిట.
వింటుంటేనే ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూసేయాలా అని అనిపిస్తోంది కదూ, కానీ జనవరి 11 వరకూ వెయిట్ చేయకతప్పదు మరి. అంతకంటే ముందు జనవరి 5న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న విషయం తెల్సిందే. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నారు.
It’s U/A for #SarileruNeekevvaru
A Perfect Entertainer is all set for Grand World Wide Release
Experience #SuperStarSankranthi Only In Theatres
Super
@urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @ThisIsDSP #MaSSMB pic.twitter.com/YGWUwSNoL7
— AK Entertainments (@AKentsOfficial) January 2, 2020
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36lpQWj




Comments
Post a Comment