సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంపై భారీ అంచనాలు ఉన్న విషయం తెల్సిందే. మహేష్ బాబు వరస హిట్స్ మీద మంచి జోష్ లో ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి చిత్రాలు అంచనాలను అందుకుని హిట్స్ గా నిలిచాయి. అయితే మహేష్ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ పడి చాలా రోజులైంది. ఈ నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు అలాంటి చిత్రం కాగలదని ఫ్యాన్స్ అందరూ నమ్మకంగా ఉన్నారు. మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంగతి తెల్సిందే. అనిల్ రావిపూడి సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రెస్. మరి అలాంటి దర్శకుడు టాప్ రేంజ్ హీరోతో ఎలాంటి సినిమా చేశాడా అని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐతే ఇప్పటివరకూ రిలీజైన ప్రోమోలు, పాటలు అన్నీ ఆసక్తికరంగా ఉండడంతో సరిలేరు నీకెవ్వరుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 109 కోట్ల మేర ఈ చిత్రానికి బిజినెస్ జరిగింది. భరత్ అనే నేను, మహర్షి సినిమాల తర్వాత మరోసారి 100 కోట్ల మేర బిజినెస్ కాబడిన చిత్రంగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది.
ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే..
నైజాం – 33 కోట్లు
సీడెడ్ – 12.2 కోట్లు
గుంటూరు – 7.5 కోట్లు
వైజాగ్ – 9.8 కోట్లు
ఈస్ట్ – 7.5 కోట్లు
వెస్ట్ – 5.5 కోట్లు
కృష్ణా – 6.3 కోట్లు
నెల్లూరు – 3.2 కోట్లు
ఆంధ్ర – తెలంగాణ – 85 కోట్లు
కర్ణాటక – 8.5 కోట్లు
ఇండియా – 1.8 కోట్లు
ఓవర్సీస్ – 13.70 కోట్లు
వరల్డ్ వైడ్ – 109 కోట్లు
అంటే సరిలేరు నీకెవ్వరు దాదాపు 115 కోట్లు వసూలు చేసే కానీ దాన్ని హిట్ కేటగిరీలో వేయలేం. అయితే అన్నీ పాజిటివ్ గా ఉన్న ఈ చిత్రానికి సంక్రాంతి సెలవుల హంగామా కూడా తోడవుతోంది కాబట్టి ఈ చిత్రానికి మంచి టాక్ వస్తే ఈ టార్గెట్ నల్లేరు మీద నడకే అనుకోవచ్చు. అల వైకుంఠపురములో సినిమా ఎఫెక్ట్ ఈ చిత్రంపై ఎంత మేర పడుతుంది అన్న దాన్ని బట్టి ఈ చిత్ర సక్సెస్ రేంజ్ ఆధారపడి ఉంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SSKkBG
Comments
Post a Comment