పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడు. రాజకీయాలను కూడా సమాంతరంగా చూసుకుంటూనే సినిమాల్లో కూడా నటించనున్నాడు. చాలా కాలం నుండి వార్తల్లో ఉంటూ వస్తోన్న పింక్ రీమేక్ షూటింగ్ ను నిన్న మొదలుపెట్టిన విషయం తెల్సిందే. అందులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు అంటూ వార్తలు వచ్చాయి కూడా. అయితే దీనిపై ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అవి తీర్చడానికా అన్నట్లు ఒక లీక్డ్ పిక్ నిన్నటి కూడా సోషల్ మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ నడుస్తూ కనిపిస్తున్నాడు. గుబురు గెడ్డంతో పవన్ లుక్ అదిరిపోయింది. ఈ ఫోటోను పవన్ ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ గా షేర్ చేస్తూ ఆనంద పడుతున్నారు. పవర్ స్టార్ ఈజ్ బ్యాక్, బాక్స్ ఆఫీస్ అసలు మొగుడు వచ్చాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ముందుగా గెడ్డంతో ఉన్న పార్ట్ పూర్తి చేసి తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను పూర్తి చేయబోతున్నారు. మార్చ్ నెలాఖరు కల్లా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటించబోతున్నాడు. అలా అని ఇందులో హీరోయిజం చూపించే సన్నివేశాలకు కొదవేం లేదు. పింక్ లో అమితాబ్ పాత్ర చాలా ప్యాసివ్ గా ఉంటుంది. అలా కాకుండా ఇందులో పవన్ ను అభిమానులకు నచ్చే విధంగా చూపించబోతున్నారు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్నాడు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఈ చిత్రంలో 5 పాటలు ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర టైటిల్ మరియు పవన్ లుక్ ను కూడా వచ్చే నెలలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. నివేతా థామస్ ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/38pI7SN
Comments
Post a Comment