Skip to main content

డిస్కో రాజా మూవీ రివ్యూ

డిస్కో రాజా మూవీ రివ్యూ
డిస్కో రాజా మూవీ రివ్యూ

మూవీ రివ్యూ: డిస్కో రాజా
నటీనటులు: రవితేజ, నభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్, బాబీ సింహా, సునీల్, సత్య తదితరులు
దర్శకత్వం: విఐ ఆనంద్
నిర్మాత: రజినీ తాళ్లూరి
సంగీతం: ఎస్ ఎస్ థమన్
విడుదల తేదీ: జనవరి 24, 2020
రేటింగ్: 3.25/5

గత మూడేళ్ళలో రవితేజ నుండి ఒక్క ప్రామిసింగ్ సినిమా కూడా రాలేదు. అయితే విడుదలకు ముందు నుండీ డిస్కో రాజా ప్రేక్షకులలో అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఈ సినిమా ఒక విభిన్నమైన చిత్రమన్న ఫీలింగ్ అందరిలో కలిగింది. టాలెంటెడ్ దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:
సైన్స్ ల్యాబ్ లో జరిగే ఒక ప్రయోగం వల్ల బ్రెయిన్ డెడ్ పెర్సన్ వాసు (రవితేజ) మాములు మనిషవుతాడు. అయితే తన గతం మొత్తం మర్చిపోతాడు. తనెవరో తెలుసుకునే క్రమంలో ఎంపీతో గొడవ పెట్టుకుంటాడు. దానివల్ల వాసు ఫేమస్ అయ్యి తన వాళ్ళను చూడగలుగుతాడు. అంతే కాకుండా చెన్నై నుండి సేతు (బాబీ సింహా) డిస్కో రాజ్ (రవితేజ)కు వాసుకు సంబంధం ఉందనుకుని వెతుక్కుంటూ వస్తాడు. ఇంతకీ వాసు మీద జరిగిన ప్రయోగం వల్ల వాసు బాడీకి ఏం జరుగుతుంది? సేతు ఎవరు? డిస్కో రాజ్ కు వాసుకు ఉన్న సంబంధమేంటి? వాసు కు డిస్కో రాజ్ కు ఉన్న గొడవలేంటి? చివరికి ఏమైంది?

నటీనటులు:
రవితేజ ఈ చిత్రంలో విభిన్నంగా అనిపిస్తాడు. ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండే రవితేజను కాకుండా సినిమా మొదట్లో సరికొత్త రవితేజను చూస్తాం. చాలా సటిల్ యాక్టింగ్ తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు మాస్ మహారాజా. అయితే ఒక్కసారి డిస్కో రాజా పాత్ర ఎంట్రీ ఇచ్చాక కథ మారిపోతుంది. డిస్కో రాజా పాత్రలో రవితేజ పూర్తిగా మెప్పిస్తాడు. తనకలవాటైన మ్యానరిజమ్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసాడు. డిస్కో రాజ్ తెర మీద ఉన్నంతసేపూ ప్రేక్షకులకు బోర్ కొట్టదు అంటే చూసుకోండి. మొత్తంగా రవితేజకు యాక్టింగ్ పరంగా మంచి మార్కులు వేయించుకునే అవకాశం కల్పించింది రవితేజ. మూడు భిన్నమైన షేడ్స్ ను రవితేజ చాలా సులువుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు.

ఇక పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్య హోప్ లకు చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఉన్నంతలో పాయల్ పాత్రకు కొంత ప్రాధాన్యత ఉంది. హెలెన్ పాత్రలో ఆమె నటన బాగుంది. విలన్ గా నటించిన బాబీ సింహా అదరగొట్టాడు. తనని ఎందుకందరూ గొప్ప నటుడంటారో మరోసారి ఈ సినిమా ద్వారా చూపించాడు. సునీల్ కు ఒక విభిన్నమైన పాత్ర లభించింది. అతని పాత్ర మిశ్రానుభూతులు మిగుల్చుతుంది. అలానే సత్య, వెన్నెల కిషోర్ ఉన్న కాసేపూ నవ్వించడానికి ప్రయత్నించారు కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. మిగిలిన వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:
ముందుగా థమన్ మ్యూజిక్ గురించి ప్రస్తావించుకోవాలి. పాటలన్నీ ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వాటిని తెరపై ఇంకా బాగా చూపించారు. రెండు పాటల్లో కథ కూడా భాగంగా ఉంటుంది. థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పూర్తి మార్కులు వేయించుకుంటాడు. ఫ్రీక్ అవుట్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఐస్ ల్యాండ్ లో సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కూడా ఫ్రేమ్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ క్రిప్స్ గా ఉంది. ఫైట్స్ ఓకే. కథ విభిన్నంగా మొదలైనా తర్వాత రెగ్యులర్ రివెంజ్ డ్రామా రూట్ తీసుకుంటుంది. విఐ ఆనంద్ దర్శకత్వం కూడా మిక్స్డ్ ఫీలింగ్స్ కలిగిస్తుంది. డిస్కో రాజ్ పాత్రపై పెట్టిన శ్రద్ధ మిగతా పాత్రల డెవలప్మెంట్ పై పెట్టలేదనిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అవుతుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

విశ్లేషణ:
డిస్కో రాజా మొదలుపెట్టిన విధానం, ఆ తర్వాత ల్యాబ్ లో చేసిన ప్రయోగం, ఆపై ఇంటర్వెల్ కు ముందు డిస్కో రాజ్ పాత్ర పరిచయం.. ఇలా చకచకా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ మొదలైన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా వచ్చింది. అయితే ఒక్కసారి మళ్ళీ ప్రెజంట్ కు వచ్చాక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోకి మారిపోతుంది చిత్రం. అలాగే ముందు చూపించిన ల్యాబ్ ప్రయోగం మళ్ళీ ఎక్కడా ప్రస్తావనకు రాదు. ఇవి పక్కన పెడితే డిస్కో రాజ్ పాత్ర ఒక్కటే పైసా వసూల్ అనిపిస్తుంది. ఇందులో రవితేజ ఎనర్జీ చూస్తే ఫ్యాన్స్ కు పండగే. మొత్తంగా డిస్కో రాజా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలున్నా సరిగ్గా డీల్ చేయని కారణంగా ఎబోవ్ యావరేజ్ రేంజ్ అనిపించుకుంటుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2GoEQHj

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...