వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ. సినిమాల కంటే వివాదాల వల్లే పాపులారిటీని సొంతం చేసుకుంటూ దర్శకుడిగా సర్వేవల్ అవుతున్నారు. తన సినిమాలతో థియేటర్లలో కంటే సోషల్ మీడియా వేదికలపైనే హంగామా చేస్తున్న వర్మ గత ఏడాది తీసిన రెండు చిత్రాలు వివాదాలని సృష్టించాయి. దివంగత ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తీసిన `లక్ష్మీస్ ఎన్టీఆర్`, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వరుస వివాదాల్ని సృష్టించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కలకలాన్ని రేపాయి.
నిత్యం వివాదాలనే నమ్ముకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లతో హంగామా చేస్తున్న రామ్‌గోపాల్‌వర్మ డిసెంబర్ 31 అర్ధ్రరాత్రి ఓ ఫొటోని పోస్ట్ చేశారు. ఓ యువతి ల్యాప్ పక్కన తల పెట్టి స్టిల్ ఇచ్చిన ఆ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. న్యూ ఇయర్ పార్టీని తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న వర్మ తన డెన్‌లో ఓ యువతితో దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ యువతి మరెవరో కాదు `బ్యూటిఫుల్` చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన శ్రేయా బెనర్జీ.
`సూపర్ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రేయా బెనర్జీ. `బ్యూటిఫుల్` చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. బ్యూటిఫుల్ ఉమెన్ ఎలా డ్రెస్ చేసుకోవాలో ఆమెకే తెలుసు.` అని తను సోషల్ మీడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫొటోలని ఉద్దేశించి వర్మ ట్వీట్ చేశారు. వర్మతో పాటు ఆ సినిమా ఎడిటర్ అన్వర్ కూడా శ్రేయా బెనర్జీ తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. న్యూ ఇయర్ పార్టీ కోసం వర్మ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రేయా బెనర్జీతో చేయించి థై షో చూసిన వాళ్లంతా ఈ థై షో ఏంటి బాబోయ్ అని బోరుమంటున్నారట.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35mbT9n
Comments
Post a Comment