సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న విడుదలకు ముస్తాబవుతోంది. రేపో, ఎల్లుండో ఈ సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తయిపోతాయ్. దీంతో మహేష్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే దానికంటే ముందు ఈ ఆదివారం జరగబోయే ప్రీ రిలీజ్ వేడుక మీద అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నాడు. ఇలా మహేష్, చిరును ఒకేసారి వేదికపై కలిసి చూడటం అటు మెగాభిమానులకు, ఇటు సూపర్ స్టార్ అభిమానులకు వీనుల విందే. అందుకే ఈ ఈవెంట్ కు మెగా సూపర్ ఈవెంట్ అనే పేరు పెట్టారు.
సాధారణంగా మహేష్ సినిమాలకు సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేసేవారు. అయితే వయసు పైబడడం వల్ల ఆయన వేడుకలకు రావడం తగ్గించేశారు. ఇకపోతే గత కొన్ని సినిమాలుగా మహేష్ తన రూట్ ను మార్చాడు. క్రమంగా సీనియర్ హీరో హోదాలోకి వెళుతోన్న మహేష్ తాను అందరివాడినని చెప్పుకోవడానికి బయట హీరోలను తన ఫంక్షన్ లకు ముఖ్య అతిధిగా ఆహ్వానించడం మొదలుపెట్టారు. భరత్ అనే నేను ఈవెంట్ కు తారక్ వస్తే, మహర్షి ఈవెంట్ కు విజయ్ దేవరకొండ విచ్చేశాడు. అయితే ఈసారి ఏకంగా చిరంజీవి రాబోతుండడం విశేషం.
ఇక నిర్మాత అనిల్ సుంకర ఈ ఈవెంట్ లో మరో మెయిన్ హైలైట్ ను ఇటీవలే మీడియాతో పంచుకున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబు స్వయంగా హోస్ట్ గా వ్యవహరించనున్నాడట. అంటే చిరంజీవి సహా అతిధులను, కాస్ట్ అండ్ క్రూ ను పేరుపేరునా మహేష్ స్వయంగా స్టేజ్ మీదకు ఆహ్వానించడం దగ్గరనుండి, వారి చేత మాట్లాడించడం, అభిమానులతో ముచ్చటించడం మొదలగునవి చేయనున్నాడు. అయితే మహేష్ మొత్తం ఈవెంట్ ను హోస్ట్ చేసే అవకాశాలు తక్కువే. ఈవెంట్ ఆఖరు గంట లేదా అరగంట హోస్ట్ చేయనున్నాడు. మాట్లాడడానికి కూడా మొహమాట పడే మహేష్ క్రమంగా ఇలా ఓపెన్ అవుతుండడం నిజంగా తన ఫ్యాన్స్ కు కిక్కిచ్చేదే!
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Fg52ng
Comments
Post a Comment