భారీ అంచనాల మధ్య విడుదలైన `సాహో` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఫలితం ఎలా వున్నా ఉత్తరాదిలో మాత్రం ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. కలెక్షన్‌ల పరంగా సరికొత్త రికార్డుల్ని నెలకొల్పింది. అయితే సంతృప్తికరమైన ఫలితాన్ని మాత్రం అందించలేకపోయింది. దీంతో ఆలోచనలో పడ్డ ప్రభాస్ కొంత విరామం తీసుకుని, స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించారు.
ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రం `జాన్`. వర్కింగ్ టైటిల్‌గా ఈ పేరు వినిపిస్తోంది. `జిల్` ఫేమ్ రాధాకృష్ణకుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పిరియాడిక్ రొమాంటిక్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని హీరో ప్రభాస్ సోషల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్ వేదికగా సెట్‌లో వున్న తన ఫొటోతో పాటు ఆసక్తికమైన విషయాన్ని షేర్ చేశారు.
నా రాబోయే సినిమాని ఈ రోజే తిరిగి ప్రారంభించాను. చాలా ఫన్ షెడ్యూల్ ఇది. దీని కోసం ఎదురుచూస్తున్నాను` అని వెల్లడించారు. ఇందులో హీరోయిన్‌గా పూజా హేగ్డే నటిస్తోంది. 1970 నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ మొత్తం యూరప్ లోనే చిత్రీకరిస్తున్నారు. కొన్ని కీలక అంశాల్ని మాత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో షూట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన సెట్‌లో ప్రభాస్ వున్న ఫొటోనే ఆయన శనివారం అభిమానుల కోసం షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3ain3zw
Comments
Post a Comment