మలయాళం సినిమాలంటే ఎక్కువశాతం శృంగారభరితమైన సన్నివేశాలతో ఉంటాయని గతంలో ఒక తప్పు అభిప్రాయం జనాల్లో ఉండేది. అయితే కొత్త కథలతో, కొత్త నటీనటులు, టెక్నీషియన్లు ఎప్పటికప్పుడు టెక్నాలజీని సైతం అప్ గ్రేడ్ చేసుకుంటూ ఈరోజు క్రియేటివిటీ ఎక్కడ.? అంటే మలయాళం ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. బాడీగార్డ్ నుండి అంగమలై డైరీస్, ప్రేమమ్ వరకూ కూడా ఇప్పుడు ఒక్కసారి మళయాళం వాళ్ళ సినిమాలు చూస్తే అసలు విషయం తెలుస్తుంది.
అయితే ఇప్పుడు మలయాళంలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు “పచ్చ మాంగా”. అంటే తెలుగులో పచ్చిమామిడి అని అర్ధం. ఇందులో నటించిన నటి సోనా చేసిన గ్లామర్ షో పై అందరూ విమర్శిస్తున్నారు. ఇక టెక్నికల్ గా ఈ సినిమా అయితే రిచ్ గా లేదు. ఆ విషయం ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇక సోనా కుచేలన్, కో వంటి సినిమాల్లో కూడా గ్లామర్ పాత్రలే చేసారు. సినిమాలో విషయం లేకపోతే ఇప్పుడు నూటికి తొంభై తొమ్మిది శాతం మేకర్స్ గ్లామర్ సీన్స్ ప్రమోట్ చేస్తూ, యూత్ సినిమాల పేరిట, బూతు సినిమాలు వదులుతున్నారు. ఇక అరచేతిలో సార్ట్ ఫోన్ ఉన్న యువత వాటికి అలవాటు పడుతున్నారు. ఇందులో శృంగార ప్రదర్శన చేసే నటీనటులను విమర్శించవలసిన అవసరం లేదు. ఇలాంటివి తీస్తూ ఎంకరేజ్ చేసే వాళ్ళది తప్పు. ప్రజలు ఇలాంటి సెమీ న్యూడిటీ చూడటం తగ్గించడం పై వీటి భవిష్యత్ ఆధారపడి ఉంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36ozQx7
Comments
Post a Comment