ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఒక చాన్స్ వస్తే వెండితెరపై వెలిగిపోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనిషి దగ్గర పనసగింజ అంత పనితనం ఉన్నా, ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి. అది లేటుగా వస్తే ఇండస్ట్రీ లో బ్రేక్ కూడా లేటు గానే వస్తుంది. ఉదాహరణకు ఇండస్ట్రీ లో ఒకానొక సీనియర్ నటుడు మొదట నేరుగా “గండికోట రహస్యం” అనే సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర వేసినా కూడా 20 ఏళ్ళ పాటు బ్రేక్ రాలేదు. మళ్ళీ ఎప్పటికో ఖడ్గం అనే సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక్క డైలాగ్ తో 20 ఏళ్ళ స్ట్రగుల్ సాల్వ్ అయిపొయింది.
ఇప్పుడు ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా “సరిలేరు నీకెవ్వరు” లో “రమణ…. లోడ్ ఎత్తాలి రా.మళ్ళీ చెక్ పోస్ట్ పడతాది.” అనే ఒక్క డైలాగ్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు కుమార్ సేతు రామన్ అలియాస్ “సరిలేరు రమణ”. ఇక ఈ డైలాగ్ మళ్ళీ కౌంటర్ గా మహేష్ కూడా చెప్పసరికి మంచి పే ఆఫ్ అయ్యి ఇప్పుడు ఆయన ఎక్కడికెళ్ళినా, రమణా… రమణా.. అని జనాలు వెంటపడుతున్నారు. మహేష్ బాబు తన సినిమాల్లో సిన్సియర్ గా ఉండే ఆర్టిస్ట్ లనూ, టెక్నీషియన్ లనూ గమనిస్తూ, వాళ్ళకి రిపీటేడ్ గా తన సినిమాల్లో ఛాన్స్ లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక మన రమణ కూడా బిజీ అయిపోయాడు. 20 ఏళ్లలో రాని బ్రేక్ ఆయనకు ఒక్క డైలాగ్ కు వచ్చేసింది. ఇక సినిమా ఫైట్ సీన్ లో తన కాలికి గాయం అయితే, మహేష్ బాబు గారు దగ్గరుండి డాక్టర్ కి చూపించారని, ఆయన కోసమే కట్టు కట్టుకుని ఎంత బాధ పడుతున్నా, ఆ ఫైట్ పూర్తి చేసానని కుమార్ సేతు రామన్ చెప్పారు. నిజంగా మహేష్ సూపర్ స్టార్ అని కితాబిచ్చారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TVSQQO
Comments
Post a Comment