కమర్షియల్ కథానాయికగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది కాజల్ అగర్వాల్. తెలుగులో క్రేజీ కథానాయికగా స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న కాజల్ హవా ప్రస్తుతం తగ్గిపోయింది. మునుపటి తరహాలో ఆమె డిమాండ్ తగ్గిపోయింది. ప్రస్తుతం క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నా ఈ సారి కొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని, ఈ సారి కాజల్ ప్రేక్షకుల్ని షాక్‌కు గురిచేయబోతోం దని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు గ్లామర్ హీరోయిన్‌గా ఆకట్టుకున్న కాజల్ తాజా చిత్రంలో మాత్రం అందుకు భిన్నంగా నెగెటివ్ పాత్రలో కనిపించనుందట. 1996లో వచ్చిన చిత్రం `భారతీయుడు`. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమాకు కొనసాగింపుగా `ఇండియన్ 2` పేరుతో ఓ చిత్రాన్ని శంకర్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
కీలక పాత్రల్లో హీరో సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్‌సింగ్, బాబీ సింహా, ప్రియాభవానీశంకర్, సముద్రఖని నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 20న రిలీజ్ చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ రెగ్యులర్ హీరోయిన్‌గా కాకుండా కమల్‌హాసన్‌ని ఆటపట్టించే నెగెటివ్ పాత్రలో కనిపించనున్నట్టు తమిళ చిత్ర వర్గాల కథనం.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2u82h4N
Comments
Post a Comment