సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో చాలా విచిత్రమైన ప్రయోగాలు చేసాడు. భరత్ అనే నేను ఈవెంట్ లో ముఖ్య అతిధిగా హాజరైన తారక్ తమ తరం హీరోల్లో మహేష్ చేసినట్టుగా ఎవరూ ప్రయోగాలు చేయలేదని కితాబిచ్చాడు. అయితే మహేష్ ప్రయోగాలు అయితే చేసాడు కానీ దాన్నుండి ఎక్కువగా ఎదురుదెబ్బలే తిన్నాడు. నాని, నిజం, ఖలేజా, 1 నేనొక్కడినే చిత్రాలు రొటీన్ కు భిన్నంగా ఉంటాయి కానీ వాటి ఫలితాలు ఏంటో అందరికీ తెల్సిందే. ఈ ఎదురుదెబ్బల నుండి మహేష్ మంచి పాఠాలే నేర్చుకున్నట్లున్నాడు. ప్రయోగాల విషయంలో తన వైఖరి పూర్తిగా మార్చేసుకున్నాడు.
ఇప్పుడు ఎవరైనా ప్రయోగాల గురించి అడిగితే ఆసక్తికరమైన సమాధానం ఇస్తున్నాడు. టాప్ హీరోలు అందరూ విచిత్రమైన జోన్లో ఉన్నామని చెబుతున్నాడు మహేష్. ప్రయోగాల చేయాలన్నప్పుడు వినడానికి బాగానే ఉంటుంది కానీ ఎలా పడితే అలా ప్రయోగాలు చేసేయకూడదు. రొటీన్ కు భిన్నంగా ప్రయత్నిస్తూనే ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలి. వందల కోట్ల బిజినెస్ లు అవుతున్నాయి. వందల మంది జీవితాలు ఒక సినిమాపై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునే నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కొత్తదనం ఉంటూనే కమర్షియల్ అంశాలకు కొదవలేని కథలు చేయాలని అంటున్నాడు.
ఇక ప్యాన్ ఇండియా సినిమాపై కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దక్షిణాది సినిమాలు ఇప్పుడు బాగా ఆడుతున్నాయి. రీజినల్ సినిమా అన్న సరిహద్దుని చెరిపేసి ఇండియా అంతటా మంచి విజయాలు సాధిస్తున్నాయి. కేజిఎఫ్, బాహుబలి వంటి సినిమాలే అందుకు ఉదాహరణలు. మంచి కథ దొరికితే నేను కూడా ప్యాన్ ఇండియా చిత్రం చేయడానికి రెడీ అని అంటున్నాడు మహేష్.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/384sdgL
Comments
Post a Comment