గతంలో క్షీర సాగర మధనం జరిగినప్పుడు పాలసముద్రంలో నుంచి పుట్టిన అనేక మంది అప్సరసలలో శాపవశాత్తూ ఒకరు భూమ్మీద జన్మించి అనుష్క అయింది. అమ్మాయి బాగుంటే అందంగా ఉంది.! అని గతంలో అనేవాళ్ళు. లేదంటే కొంతమంది పెద్ద వాళ్ళు “మహాలక్ష్మి లా..ఉంది!” అంటారు. ఇప్పుడు జనరేషన్ వాళ్లు, మాత్రం అమ్మాయి అన్ని రకాలుగా బాగుంటే, ఏ మాత్రం ఆలోచించకుండా అనుష్క లాగా ఉంది అంటున్నారు.
సరే… ఇప్పుడు విషయానికి వస్తే, అనుష్క సోలో హీరోయిన్ గా కనిపించి చాలా రోజులైంది. అనుష్క నటిస్తున్న తాజా చిత్రం నిశ్శబ్దం. తమిళనటుడు మాధవన్ అంజలి, షాలిని పాండే ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్ మరియు ప్రముఖ రచయిత కోన వెంకట్ కలిసి నిర్మిస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా ఈ నెల జనవరి 31వ తేదీన విడుదల కావాలి.
కానీ సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో అనుష్క మాటలు రానటువంటి ఒక మూగ కళాకారిణి పాత్రలో నటిస్తున్నారు. ఇందులో అనుష్క క్యారెక్టర్ పేరు సాక్షి. అంటే సినిమా ప్రకారంగా జరిగే సంఘటన అన్నిటికీ ఆమె సాక్షిగా ఉంటుంది. కానీ ఏం జరుగుతుందో చెప్పలేదు. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం మలయాళం భాషలతో పాటు ఇంగ్లీషులో కూడా విడుదల కానుంది. ప్రస్తుతం అనుష్క సినిమా కోసం ఎదురుచూడటం అప్సరస కోసం తపస్సు చేయడం ఒకేలా ఉంది అభిమానులకి…. వెయిటింగ్ ఫర్ అవర్ స్వీటీ.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/37sKUum
Comments
Post a Comment