Skip to main content

అల్లు అర్జున్ ఎక్కడా తగ్గకూడదని డిసైడ్ అయ్యాడుగా

అల్లు అర్జున్ ఎక్కడా తగ్గకూడదని డిసైడ్ అయ్యాడుగా
అల్లు అర్జున్ ఎక్కడా తగ్గకూడదని డిసైడ్ అయ్యాడుగా

సాధారణంగా కొన్నేళ్ల క్రితం వరకూ మన హీరోలు ప్రమోషన్స్ అంటేనే అంటీముట్టనట్టుగా ఉండేవారు. ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు ఇంటర్వ్యూలతో సరిపెట్టేవారు. మౌత్ టాక్ తోనే సినిమా ఊపందుకుని హిట్స్ అయ్యేవి. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. సినిమాలకు లాంగ్ రన్స్ తగ్గిపోయాయి. మహా అయితే నాలుగైదు వారాలు ఆడుతున్నాయి అంతే. అది కూడా సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే. లేదంటే రెండు వారాలకు మించట్లేదు.

దాంతో ఎంత వెనక్కి తిరిగి రాబట్టుకున్నా ఈ రెండు, మూడు వారాల్లోనే. అందుకే సినిమాకు ఓపెనింగ్స్ అనేవి చాలా కీలకం. తొలి వారాంతంలోనే ఎంత వీలయితే అంతా రాబట్టేసుకోవాలి. ఈ సత్యాన్ని మన స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా తెలుసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్ని చిత్రాలుగా ఈ విషయాన్ని గ్రహించి అన్ని రకాల మీడియాలకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ప్రతి సినిమాకూ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే తెలుగు టివి మీడియాకు, సోషల్ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

సాధారణంగా ఎక్కువ సంఖ్యలో ఇంటర్వ్యూలకు పెద్దగా ఆసక్తి చూపించని బన్నీ కూడా అల వైకుంఠపురములో విషయానికి వచ్చేసరికి మారిపోయాడు. ఈసారి భారీ సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ముందుగా బాలీవుడ్ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. వారందరూ ఇప్పుడు వాటిని టెలికాస్ట్ చేస్తున్నారు. దీంతో జాతీయ స్థాయిలో బన్నీ సినిమా గురించి చర్చ నడుస్తోంది. త్వరలోనే మన మీడియాకు కూడా అధిక సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమా రిలీజ్ తర్వాత కూడా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ ను గట్టిగానే ప్లాన్ చేసారు.

ఈసారి సంక్రాంతి పోటీ విపరీతంగా ఉండడంతో బన్నీ ఎక్కడా తగ్గకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే బన్నీ ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్ కు తోడు కంటెంట్ కూడా బాగుంటే అల వైకుంఠపురములో చిత్రాన్ని ఎవరూ ఆపలేరు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tEUewr

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...