తలైవా రజనీ సినిమా వస్తోందంటే దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు వుండే హంగామానే వేరు. భాషలు దాటిన అభిమానం సూపర్‌స్టార్ రజనీ సొంతం. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, స్టేట్ ఏదైనా రజనీ సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు అదీ రజనీ క్రేజ్ అంటే. రజనీ నటించిన తాజా చిత్రం `దర్బార్` ఈ సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఎ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత అల్లిరాజా సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు తొలి షో నుంచే హిట్ టాక్‌ని సొంతం చేసుకుని వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్‌ని రఫ్పాడించేస్తోంది. దాదాపు 9 ఏళ్లుగా రజనీ నుంచి మెస్మరైజింగ్ హిట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. `దర్బార్`లో అభిమానులు ఆశించిన మెరుపులు, రజనీ స్టైల్ జర్క్‌లు వుండగంతో ఈ సినిమా ఓ రేంజ్‌లో ఫ్యాన్స్‌ని, అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో సునాయాసంగా చేరిన ఈ చిత్రం తాజాగా ఆ 50కూడా దాటేసి 150 కోట్ల క్లబ్‌ని చేరుకుంది.
ఈ సందర్భంగా మేకర్స్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. `ఆట ఎవరైనా ఆడతారు కానీ.. సింహాసనం మాత్రం రాజుకే దక్కుతుంది. ఇదుగో `దర్బార్` వరల్డ్‌వైడ్ కలెక్షన్స్` అంటూ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా లైకా సంస్థ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TnV632
Comments
Post a Comment