మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య పంథా మార్చారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన, ఆ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైన హీరోల ఫంక్షన్‌లకి మాత్రమే అంటెడ్ అయ్యే చిరంజీవి తన పంథాకు భిన్నంగా ఫంక్షన్‌లకి, ప్రీరిలీజ్ ఈవెంట్‌లకి హాజరవుతూ పరిశ్రమలో కొత్త సంప్రదాయానికి తెరతీస్తున్నారు. గతంలో యంగ్ హీరో నాగశౌర్య నటించిన `ఛలో` చిత్ర ఫంక్షన్‌లో పాల్గొని ఆశ్చర్యపరిచిఆయన తాజాగా సూపర్‌స్టార్ మహేష్ `సరిలేరు నీకెవ్వరు` ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా రావడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
ఈ వేదికపై మహేష్‌ని చూస్తుంటే తన కొడుకుని చూస్తున్న ఫీలింగే వుందని, అతని చిరునవకవు వెనక చిలిపి తనం కూడా వుందని, కనిపించని దొంగ అని మహేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మహేష్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ గురించి ప్రస్థావిస్తూ సౌత్ ఇండియాలోనే సీనియర్ మోస్ట్ మాక్టర్ కృష్ణగారు అని, అలాంటి వ్యక్తికి దక్కాల్సిన గౌరవం దక్కలేదని తన మనసులో మాటని బయటపెట్టారు. ఆయనకు దాదా సాహోబ్ ఫాల్కే పురస్కారం అందాలని, ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కృషి చేయాలని కొరడం కాదని డిమాండ్ చేస్తున్నానని వెల్లడించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
తెలుగు సినిమాకు కొత్త టెక్నాలజీని అందించడమే కాదు.. 350కి పైగా సినిమాల్ని చేసిన ఆయన ధైర్య సాహసాలకు పెట్టింది పేరని, హైదరాబాద్‌కు సినీ పరిఠశ్రమ తరలిరావడంలో ఆయన కృషి కూడా వుందని, ఇక్కడ పెద్ద స్టూడియోని కూడా నిర్మించారని, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఆయన అన్ని విధాలా అర్హులని స్పష్టం చేశారు. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్య మంత్రులు చిరు డిమాండ్‌ని ఎంత వరకు నెరవేరుస్తారు అన్నది వేచి చూడాలని సినీ వర్గాలు అంటున్నాయి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ZVwCj5
Comments
Post a Comment