Skip to main content

“మా.. డైరీ” రిలీజ్ వేదికగా మళ్లీ రచ్చ

“మా.. డైరీ” రిలీజ్ వేదికగా మళ్లీ రచ్చ
“మా.. డైరీ” రిలీజ్ వేదికగా మళ్లీ రచ్చ

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతైనా స్టార్ల మధ్య ఐకమత్యం తక్కువ అన్న విషయం మరొక సారి రుజువైంది. కొద్దిసేపటి క్రితమే జరిగిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మరొకసారి సభా మర్యాద మరిచిపోయి మాట మాట అనుకునే స్థాయికి వీళ్ళ విభేదాలు వెళ్లాయి. వివరాల్లోకి వెళితే, ఈరోజు జరిగినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు మరియు మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్, కళాబంధు శ్రీ సుబ్బిరామి రెడ్డి గారు లాంటి అతిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత నరేష్ గారు మరియు పరుచూరి గోపాలకృష్ణ గారు తీసుకోగా, మధ్యలో కొన్నిసార్లు జీవిత గారు మరియు రాజశేఖర్ గారు కలగజేసుకుని, వారి వంతుగా కొంత మందిని వేదికపైకి పిలుస్తూ కొద్దిగా ప్రహసనం తలపించే విధంగా ప్రవర్తించారు.

ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అంతరాయం కలిగించే విధంగా రాజశేఖర్ గారు ప్రవర్తించి మైకు తీసుకుని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి “తాను సినిమాల కంటే ఎక్కువగా మా కోసమే పని చేస్తున్నాము.. కానీ మాకు సరైన గుర్తింపు మర్యాద గౌరవం దక్కడం లేదు. నిప్పు లేకుండా పోగా రాదు. లైఫ్ లో భాగంగా సినిమాల్లో హీరోగా నటించడం కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోగా పనిచేయాలి. అలానే రియల్ లైఫ్ లో హీరో గా పని చేస్తుంటే నన్ను కొంతమంది తొక్కేస్తున్నారు..!” అని అసహనం వ్యక్తం చేశారు.

ఇక వేదికపై కృష్ణంరాజుగారు సుబ్బిరామిరెడ్డి గారు వంటి వాళ్ళు ఉండగా వీళ్ళు ఇలా ప్రవర్తించడం చూసి మెగాస్టార్ చిరంజీవి కూడా కొంచెం ఆగ్రహానికి గురయ్యారు. “కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు ఉండటం సహజం. వాటిని నాలుగు గోడల మధ్య వివరంగా కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కానీ ఈ విధంగా ప్రవర్తించడం సరి కాదు అని చిరంజీవి సున్నితంగా హెచ్చరించారు. గతంలో కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారి మధ్య విభేదాలు వచ్చినప్పుడు చిరంజీవి నరేష్ గారి వైపు మాట్లాడటం రాజశేఖర్ మరియు జీవిత గారికి ఆగ్రహాన్ని తెప్పించింది. మధ్యలో కొంతకాలం రాజశేఖర్ గారి కుమార్తె తెరంగేట్రం విషయంలో చిరంజీవి గారు కూడా సహాయం చేసిన సందర్భంగా ఈ గొడవలన్నీ సద్దుమణిగాయని అందరూ భావించిగా, ప్రస్తుతం ఈ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీని కార్యక్రమంలో జరిగిన పరిస్థితిని చూస్తే; ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏకతాటి మీదకు రాలేదని… ఎవరికి వారే కాంపౌండ్ లు పెట్టుకొని అధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SMPijo

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...