`మా` డైరీ ఆవిష్కరణ ఈ రోజు టి. సుబ్బిరామిరెడ్డికి చెందిన హోటల్ పార్క్ హయత్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు, టి. సుబ్బిరామిరెడ్డి, డా. రాజశేఖర్, జీవిత, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డైరీ రిలీజ్ కార్యక్రమంలో డా.రాజశేఖర్ కారణంగా రసాభాసగా మారిన విషయం తెలిసిందే. తెరపైనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ హీరోగా వుండాలని వ్యవహరిస్తుంటే కొంత మంది తొక్కేస్తున్నారని డా. రాజశేఖర్ సభాముఖంగా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దీనిపై మెగాస్గార్ చిరంజీవి ఘాటుగానే స్పందించారు. మన మధ్య గుట్టుగా మాట్లాడు కోవాల్సిన విషయాన్ని మీడియా ముఖంగా బయటపెట్టడం సభ్యత కాదని, ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చిరు సూచిస్తే మోహన్‌బాబు మాత్రం రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని `మా` క్రమశిక్షణ కమిటీని కోరడం సంచలనంగా మారింది. ఓ పక్క వేదిక విమర్శలు, ప్రతి విమర్శల మెరుపులతో వేడెక్కినే వేళ .. మరో పక్క ముద్దులతో ఆకట్టుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వేదికపై చిరు, మోహన్‌బాబు ఆప్యాయంగా పలకరించుకున్న దృశ్యం అందరిని ఆకట్టుకుంది. మోహన్‌బాబుకు సడెన్‌గా చిరు ముద్దివ్వడంతో సభికులంతా అవాక్కయ్యారు.
గతంలో వజ్రోత్సవాల వేల మోహన్‌బాబు, చిరంజీవి మధ్య వాగ్యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత చిరుకి పద్మభూషణ్ వచ్చిన వేళ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా ఇండస్ట్రీ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇదే వేదిపై మాట్లాడిన మోహన్ బాబు చిరుపై పరోక్షంగా విమర్శిస్తూనే ఛలోక్తులు విరిరారు. ఆ మాటలకు ఆగ్రహించిన పవన్‌కల్యాణ్ వెంటనే మైక్ తీసుకని `తమ్ముడూ మోహన్‌బాబు` అనడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ తరువాత నుంచి ఇద్దరి మధ్య మొదలైన విభేదాలు చివరికి పరిష్కారం కావడంతో చిరుతో మోహన్‌బాబు ఫ్రెండ్స్ అయిపోయారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/39xiykk
Comments
Post a Comment