సంక్రాంతి అనగానే తెలుగు వారికి పండగ తర్వాత సినిమాలే గుర్తొస్తాయి. తెలుగు సినిమాల పరంగా అత్యధిక బిజినెస్ జరిగేది ఈ సీజన్ లోనే. బడా సినిమాలకు తోడు చిన్న సినిమాలు కూడా ధైర్యంగా తమ చిత్రాలను సంక్రాంతికి విడుదల చేసుకుంటాయి. సంక్రాంతి సీజన్ అనగానే ఫ్యామిలీ సినిమాలు అనుకుంటారు కానీ సరైన మాస్ సినిమా పడితే దాని రేంజ్ ఏ వేరుగా ఉంటుంది. ఫ్యామిలీ సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది కానీ మాస్ సినిమా జనాలకు ఎక్కితే దాని రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం సంక్రాంతి మార్కెట్ లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు హాట్ కేకుల్లా ఉన్నాయి. అందులో అల వైకుంఠపురములో ఫ్యామిలీ చిత్రం కాగా, సరిలేరు మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాల ట్రైలర్స్ బయటకు వచ్చేసాయి. సో, ప్రేక్షకులకు కూడా ఏ చిత్రాన్ని ఎంచుకోవాలనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఏ వర్గం ప్రేక్షకులు ఆ చిత్రాన్ని మొదట చూడాలని కోరుకుంటున్నారు.
మాస్ సినిమా కాబట్టి సరిలేరు నీకెవ్వరు విషయంలో డిమాండ్ మాములుగా లేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లలో డిమాండ్ అత్యధికంగా ఉంది. టయర్ 2, టయర్ 3 ఏరియాల్లో, మల్టీప్లెక్స్ లు ఇంకా ఎంటర్ అవ్వని ప్రాంతాల్లో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అంతా పాజిటివ్ గా ఉంది. పైగా మాస్ కు నచ్చే అంశాలు ఇందులో ఉన్నట్లు అర్ధమవుతోంది. అటు కామెడి, ఇటు ఫైట్స్ మెయిన్ హైలైట్స్ అని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఒక ఊరిలో రెండు థియేటర్లు ఉంటే రెండిట్లోనూ సరిలేరు చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఒకవేళ ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే అల వైకుంఠపురములో చిత్రానికి అనుకున్న రేంజ్ లో థియేటర్లు దొరకడం ఒకింత కష్టమే. ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు ఒక రోజు ముందు వచ్చి ఒకింత లాభపడేలాగే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tHpGdu
Comments
Post a Comment