ఎట్టకేలకు సస్పెన్స్ రివీల్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి ఒక్క రోజులోనే సుమారు 4 మిలియన్ వ్యూస్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ముందు నుంచి. ఫ్యాన్స్ అందరూ ఇది యాక్షన్ సినిమానా.? లేదా కామెడీ తోపాటు యాక్షన్ అంశాలు ఉండే సినిమానా.? అని, ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మహేష్ బాబు కామెడీ మెయిన్ థీం లో చేసిన సినిమాలు ఖలేజా & ఆగాడు రెండూ ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత నుండీ, మహేష్ బాబు సైలెంట్ & సటిల్ యాక్టింగ్ నే నమ్ముకున్నాడు.
అలాంటి మహేష్ ని, ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ కి ఒప్పించాడు అనిల్ రావిపూడి. ఆయన చేసిన రీసెంట్ మూవీ “రాజాది గ్రేట్” లో కూడా కామెడీ తో పాటు హీరోఇజాన్ని ఎలివేట్ చేసిన తీరు అద్భుతం. ఇక ఇప్పుడు సరిలేరు… సినిమా విషయానికి వస్తే
ఆర్మీ బ్యాక్ డ్రాప్ & హీరోయిన్ వెర్షన్ సీన్లు విజయ్ తుపాకి మూవీ నుండి,
ట్రైన్ కామెడీ ఎపిసోడ్ రవితేజ వెంకీ సినిమా నుండి,
వదిన కోసం మరిది ఫైట్ చెయ్యడం నాని M.C.A నుండి
ఇక కర్నూల్ కొండారెడ్డి బురుజు సీక్వెన్స్ మహేష్ ఒక్కడు నుండి స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది. ఇక బయ్యర్స్ కి ఇది సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే చాన్స్ లు పుష్కలంగా ఉన్నా, అటు రజనీ, ఇటు బన్నీ మ్యాజిక్ క్రియేట్ అయితే మాత్రం ఈ రొటీన్ ఎంటర్ టైనర్ కి కష్టమే. తన సినిమాల్లో కథ కన్నా, స్క్రీన్ ప్లే & ట్రీట్మెంట్ కే ఇంపార్టెన్స్ ఇస్తానని స్వయనా అనిల్ రావిపూడి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ రోజు రిలీజ్ అయ్యే అల.. వైకుంఠపురం ట్రైలర్ బట్టీ, మరింత క్లారిటీ రావచ్చు. మహేశ్ అయితే ఈ సంక్రాంతికి ప్రయోగాలు చెయ్యకుండా, మీటర్ సినిమాతోనే మన ముందుకు వస్తున్నాడు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Fm4pZ5
Comments
Post a Comment