సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది సినిమాల జాతర. ప్రతి సంక్రాంతి పండగకు మూడు, నాలుగు సినిమాలు థియేటర్ల వద్ద సందడి చేయడం చాలా మాములే. దీంతో వీటి మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది. అయితే అన్ని సినిమాలు ఉంటున్నా ఇద్దరు స్టార్ హీరోలు సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద తలపడి చాలా ఏళ్లవుతోంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇద్దరు టాప్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ లు సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతున్నారు. దీంతో థియేటర్ల వద్ద సందడి మాములుగా ఉండబోవట్లేదు. ఈ రెండు చిత్రాలు ఒకేరోజు వ్యవధిలో వస్తుండడం వల్ల బాక్స్ ఆఫీస్ పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశముంది. రేపు విడుదల కావాల్సిన సరిలేరు నీకెవ్వరు విషయంలో ఇప్పటికే థియేటర్ల వద్ద కోలాహలముంది.
గతంలో సంక్రాంతికి స్టార్ హీరోలు తలపడేవారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల హయాంలో ఎవరివైనా ఇద్దరి సినిమాలు కనీసంగా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద తలపడేవి. ముఖ్యంగా చిరు, బాలయ్య మధ్య పోరు అప్పట్లో భలే రంజుగా సాగేది. ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూ ఉంటే ఒక పక్క ఫ్యాన్ వార్స్, మరోపక్క బాక్స్ ఆఫీస్ లెక్కలు ఇలా సాగేది వ్యవహారం. వీరి తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ టాప్ స్టార్స్ గా ఎదిగినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తలపడలేదు. ఎందుకనో డిస్టెన్స్ మైంటైన్ చేసుకుంటూ వచ్చారు.
వీరి తర్వాత ఎన్టీఆర్, చరణ్, బన్నీ, ప్రభాస్ ల మధ్య కూడా ఇలాంటి పోటీ చూడలేకపోయారు. రెండూ చిత్రాలకూ మంచి జరగాలన్న ఉద్దేశంతో స్టార్ హీరోలు ఎవరూ పోటీకి సై అనకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. 2017లో సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి పోటీ పడినా చిరు పదేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇస్తుండడం, బాలకృష్ణ అప్పటి సూపర్ ఫామ్ లో లేకపోవడంతో మరీ ఒకప్పటి స్థాయి మజా రాలేదు.
అయితే ఇన్నేళ్ల తర్వాత టాప్ హీరోల సినిమాలు మహేష్, బన్నీలవి విడుదలవుతున్నాయి. ఏ రకంగా చూసినా ఇద్దరి సినిమాలూ సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. బిజినెస్ లెక్కలు కూడా దాదాపు అలాగే ఉన్నాయి. బజ్ కూడా రెండు చిత్రాలకు విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2R92ay6
Comments
Post a Comment