విక్టరీ వెంకటేష్ సాఫ్ట్ రోల్స్ ఇట్టే ఒదిగిపోతాడు. కామెడీ అంటే చెప్పేదేముంది ఇరగదీసేస్తాడు. అయితే వెంకీకి యాక్షన్ అంటే కూడా మక్కువ ఎక్కువే. తులసి లాంటి పాత్రలు పడితే కూడా తన సత్తా చూపిస్తాడు. అలాంటి వెంకీ తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను చూసి ముచ్చటపడ్డాడు. తన అన్న చేత ఈ సినిమా రీమేక్ హక్కుల్ని కొనిపించాడు. ధనుష్ పోషించిన పాత్రలో వెంకీ సరిపోతాడా అన్న సందేహాలు కలిగాయి చాలా మందికి. ఇక దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలను ఎంచుకోవడంతో అందరూ అవాక్కయ్యారు. తన కెరీర్ లో ఇప్పటివరకూ కేవలం ఫ్యామిలీ ఎంటెర్టైనెర్లు, అందరూ మంచిగా ఉండాలి అని హితబోధలు చేసిన శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి వయొలెంట్ సినిమాకు ఎలా సెట్ అవుతాడని అంతా అనుకున్నారు.
నిన్న అర్ధరాత్రి ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. షూటింగ్ ఈరోజు నుండి మొదలవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ముందుగా ప్రచారం జరిగినట్టుగానే నారప్ప అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. వెంకీ లుక్ కూడా రివీల్ చేసారు. వెంకీకు ఆ లుక్ పెర్ఫెక్ట్ గా సరిపోయింది. దిగువ మధ్యతరగతికి చెందిన ఒక పల్లెటూరి మనిషిగా, మధ్యవయస్కుడి పాత్రలో వెంకీ అతికినట్టు కుదిరాడు. అసురన్ లో ధనుష్ లుక్ ను దాదాపుగా అలాగే దించేశారు. ఫస్ట్ లుక్ పరంగా 100 కి 100 మార్కులు పడతాయి.
మరి శ్రీకాంత్ అడ్డాల ఈ రూరల్ మాస్ డ్రామాను ఎలా తీస్తాడు అన్న దానిపైనే చిత్ర విజయావకాశాలు దాగి ఉన్నాయి. బ్రహ్మోత్సవం తర్వాత అడ్రెస్ లేకుండా పోయిన అడ్డాలకు ఇదే మంచి అవకాశం. ఈ సినిమా కనుక హిట్ అయితే శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ తిరిగి ఇండస్ట్రీలో పుంజుకోవచ్చు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ప్రియమణి వెంకటేష్ భార్య పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి లేట్ సమ్మర్ కు విడుదల చేయాలని భావిస్తున్నారు.
#Naarappa Shoot Begins Today! pic.twitter.com/SexcogRnaS
— Venkatesh Daggubati (@VenkyMama) January 22, 2020
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RDkkrZ
Comments
Post a Comment