గత నాలుగైదు సినిమాలుగా తమిళ స్టార్ హీరో “దళపతి” విజయ్ ను వివాదాలు వెంటాడుతున్నాయి. ఆయన చేసిన సినిమా కథలకు సంబంధించిన రచయితలకు సరైన గుర్తింపు, పారితోషికాలు ఇవ్వలేదని ప్రధానమైన వివాదం నడుస్తోంది. తమిళ సీనియర్ దర్శకుడు కె. భాగ్యరాజా గారు ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో కూడా అన్యాపదేశంగా దీని గురించి మాట్లాడారు. అంతేకాదు విజయ్ గత చిత్రం “సర్కార్” లో వరలక్ష్మి శరత్ కుమార్ పోషించిన విలన్ పాత్ర పేరు, ఆమె ఆహార్యం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ని పోలి ఉందని కూడా వివాదం జరిగింది.
ప్రస్తుతం విజయ్ ఇటీవలే ఖైతీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగారాజ్ తో కలిసి “మాస్టర్” అనే సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ బధిర (పుట్టు మూగ & చెవుడు) పిల్లల స్కూల్ లో జరిగింది . ఇక ఈ సినిమా “సైలెన్స్ డ్” అనే కొరియన్ మూవీ కాపీ అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాలో “మక్కల్ సెల్వన్” విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ఏదీ ఏమైనా ఒక పెద్ద స్టార్ హీరో ఇలాంటి వివాదాలను సాల్వ్ చేసుకోవడమే కాకుండా, కొత్త వివాదాలు రాకుండా ఉండేలా చూసుకోవాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ZWZaZj
Comments
Post a Comment