Skip to main content

పరువు హత్యల నేపధ్యంలో ద్రౌపది

పరువు హత్యల నేపధ్యంలో ద్రౌపది
పరువు హత్యల నేపధ్యంలో ద్రౌపది

ప్రపంచంలో అయినా, సినిమాలో అయినా ధనిక పేద తేడా అనేది ఒక ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. గత దశాబ్దంలో అయితే కేవలం యూత్ ఆడియెన్స్ ని కనెక్ట్ అవ్వడానికి అన్ని భాషలలో ఇలాంటి రిచ్ – పూర్ లవ్ స్టోరీలు సినిమాలుగా తీసారు. వాటిలో సగం ఆడినయి.సగం అస్సాం అయ్యాయి. ఇక రిచ్ – పూర్ లలో కూడా జాతి,మతం కులం, రంగు ఇలా అనేక కేటగిరీలు వేసుకుని కూడా సినిమాలు తీసారు. దాదాపు అన్ని సినిమాలు ఎవరైతే, బాధితులు ఉంటారో, అదే ప్రేమికుల జంట కు అనుకూలంగా సినిమాలుగా వచ్చాయి.

కానీ ఒక వ్యక్తి ని కావచ్చు, ఒక జంటను కావచ్చు.. హత్య చేసేదాక వచ్చింది అంటే, ఇవతల పక్క వాళ్ళ వాయిస్ కూడా తెలుసుకోవాలి కదా.! ఏ కారణం లేకుండా ఎవరూ ఎవ్వరినీ చంపరు… అందులోనూ సొంత వాళ్ళను అసలు చంపరు. ధనిక – పేద దగ్గరనుండి మొదలై ఇప్పుడు ఈ జోనర్ లో పరువు హత్యల బ్యాక్ డ్రాప్ అనేది బాగా నడుస్తోంది. ఏ సమయానికి ఎలా అమ్మితే వ్యాపారం వస్తుందో అలాగే చేస్తుంది ప్రపంచం. ఇక ఇప్పుడు తమిళంలో ఇలాగే పెద్ద ఇంటి పిల్లలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసే ఒక టీమ్ మీద సినిమా వచ్చింది, సినిమా పేరు ద్రౌపది. కాకపోతే ఈ సినిమాలో కత్తికి రెండువైపులా పదును చూపించారు. బాధితులతో వెర్షన్ తో పాటు, ప్రపంచంలో ఏదీ జరిగినా తమ వ్యక్తిగత, రాజకీయ, సామాజిక ఎదుగుదలకు వాడుకునే బ్యాచ్ గురించి కూడా చూపించారు. అసలు ఈ కథ ఎంచుకొని, ఇంత రియలిస్టిక్ గా తీయ్యడానికి ఎంతో గట్స్ కావాలి. తమిళ సోదరులు క్రియేటివ్ గా తాము ఎంత ముందు ఉన్నామనేది ఈ సినిమా ద్వారా తెలియచేసారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ లో, మొదట ఒక వ్యక్తి తన భార్య చెల్లెలు కులాంతర వివాహం చేసుకుందని, తన భార్యతో సహా చంపేసినట్లు వాయిస్ వస్తుంది. దానితర్వాత ఒక వ్యక్తి హీరోతో “మా వాళ్ళు చెప్పారు… పెద్దింటి అమ్మాయిని తగులుకుంటేనే లైఫ్ లో గోప్పోళ్ళు అవుతామని..” అని అంటాడు. ఇక ఆడపిల్లను ఏడిపించిన ఒక యువకుడిని నగ్నంగా చేసి కొట్టే సీన్ కూడా ఉంది. ఏ కారణం చేత అయినా ఒకరిని హత్య చేస్తే దానిని సమాజంలోని వివిధ వర్గాలు ఎలా అనుకూలంగా మార్చుకుంటాయో కూడా దర్శకుడు నిర్భయంగా చూపించాడు. చివర్లో ఒక యువతి మాట్లాడుతూ … “ఉనకు మన్ను – పొన్ను రెండు ముఖ్యం” (మాకు భూమి, మా జాతి ఆడపిల్లలు ఎంతో గొప్ప … వాటిపై ఎవడు కన్నేసినా.. నరికేస్తాం) అనే డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. ఈ సినిమాలో రిషి రిచర్డ్ హీరోగా రెండు రకాలైన పాత్రలలో కనిపించాడు. ఈ సంచలనాత్మక సినిమా దర్శకుడు మోహన్. G.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2R68SVA

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...