వరుణ్‌తేజ్ నటించిన `తొలి ప్రేమ` చిత్రం నుంచి తమన్ సంగీతంలో చాలా మార్పు వచ్చింది. కొత్త బాణిలతో ఆకట్టుకున్నారు. తన రొటీన్ మార్కు మ్యూజిక్ నుంచి తొలిసారి ఆయన బయటికి వచ్చి చేసిన సినిమా అది. దాంతో `తొలిప్రేమ` ఆడియో ఆల్బమ్, నేపథ్య సంగీతం కొత్తగా అనిపించింది. కొత్తదాన్ని పరిచయం చేసింది. ఇక్కడి నుంచి తమన్ సక్సెస్‌ల పరంపర ఆగడం లేదు. వరుస విజయాల్ని సొంతం చేసుకుంటూనే వున్నారాయన.
గత ఏడాది డిసెంబర్ ఆయన సంగీతం అందించిన వెంకీమామ, ప్రతిరోజు పండగే మంచి విజయాల్ని సాధించాయి. ఆడియో పరంగా మంచి పేరొచ్చింది, ఆ సినిమా విజయాల్లో తమన్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది కూడా. తాజాగా అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రానికి సంగీతం అందించారు. సామజవరగమన, రాములో రాములా… ఇప్పటికే వంద మిలియన్ వ్యూస్ దాటి యూట్యూబ్‌లో రికార్డుల్ని సృష్టించాయి.
దీంతో తమన్‌కు గోల్డెన్ టైమ్ స్టార్టయిందని తమన్‌పై ప్రశంసలు కురిపించింది హీరోయిన్ పూజా హెగ్డే. సోమావారం `అల వైకుంఠపురములో` చిత్ర బృందం థ్యాంక్స్ మీట్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూజా హెగ్డే తమన్ ఈ మధ్య బిగ్ సెలబ్రిటీ అయిపోయాడని, మెస్సెజ్‌లకు కూడా స్పందించడంలేదని పై చురకలు అంటిస్తూనే అతని గోల్డెన్ టైమ్ నడుస్తోందని ప్రశంసించడం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఆకట్టుకుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tbjw5a
Comments
Post a Comment