సూపర్‌స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకరతో కలిసి దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11న ఈ చిత్రం నిలీజ్ కాబోతోంది. దీనికి ఒక్క రోజు ఆలస్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` ఈ నెల 12న రిలీక్ కాబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ముందు అనుకున్న తేదీన కాకుండా ఒక రోజు ముందుగానే రాబోతోందని, సరిలేరు నీకెవ్వరు` రిలీజ్ డేట్ కూడా మారబోతోందంటూ ఇటీవల వరుస కథనాలు వినిపించాయి.
దీంతో సంగంలోకి దిగిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమస్యని పరిష్కరించి ముందు అనుకున్న తేదీల్లోనే `సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో` రిలీజ్ అయ్యేలాగా సమస్యని పరిష్కరించుకున్నట్టు నిర్మాత దిల్ రాజు శనివారం ప్రకటించారు. ప్రతీ పెద్ద సినిమా రిలీజ్ సమయంలో సమస్యలు అంటూ కామన్‌గా వస్తుంటాయని, అయితే చివరికి ఆ సమస్య పరిష్కారం అయ్యిందాలేదా అన్నదే ఇక్కడ ప్రధానం అని, అసలు సమస్య ఎందుకు ఉత్పన్నమైందో దాని మూలాల్లోకి వెళ్లిమని, సినిమాలని రక్షించడమే మా ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదలైతే పెద్దగా రెవెన్యూ రాదని, రెండు విడి విడిగా విడుదలైతేనే అనుకున్న రెవెన్యూ వస్తుందని, ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయని, ఆ నాలుగు బాగా ఆడాలిన ఈ సందర్భంగా దిల్ రాజు వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా `సరిలేరు నీకెవ్వరు`, `అల వైకుంఠపురములో` విడుదల తేదీల విషయంలో నెలకొన్ని ఉత్కంఠకు తెరపడింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FjdWQX
Comments
Post a Comment