Skip to main content

కేరళలో అరుదైన ఫీట్ సాధించిన బన్నీ

కేరళలో అరుదైన ఫీట్ సాధించిన బన్నీ
కేరళలో అరుదైన ఫీట్ సాధించిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కేరళ రాష్ట్రంలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన స్టార్ హీరోలు వేరే భాషల్లో మార్కెట్ సంపాదించడం అన్నది చాలా అరుదుగా జరిగే విషయం. కానీ బన్నీకి కేరళలో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. తన ప్రతి సినిమా రిలీజ్ కు అక్కడ ఉండే హంగామానే వేరు. అక్కడి స్టార్ హీరోల రేంజ్ లో తన సినిమాలు కూడా మార్కెట్ అవుతుంటాయి. అయితే సాధారణంగా అల్లు అర్జున్ నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ అయిన కొన్ని వారాలకు మంచి రిలీజ్ డేట్ చూసుకుని విడుదలవుతుంటాయి. వాటికి ఓపెనింగ్స్ కూడా బానే ఉంటాయి. అయితే ఈసారి పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది.

జనవరి 12న అల వైకుంఠపురములో తెలుగుతో పాటే మలయాళంలో కూడా విడుదలవుతోంది. ఈ సినిమాను ముందు నుండే స్ట్రాటెజిగ్గా మలయాళంలో కూడా ప్రమోట్ చేసారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ రిలీజ్ కు ఏర్పాట్లు పూర్తైపోయాయి. ఎన్నడూ లేని విధంగా కేరళ బన్నీ ఫ్యాన్స్ అక్కడ స్పెషల్ ఏర్పాట్లు చేసారు. అల వైకుంఠపురములో చిత్రానికి కేరళ రాష్ట్రవ్యాప్తంగా 30 బెనిఫిట్ షోలు ప్లాన్ చేయడం విశేషం. సాధారణంగా సౌత్ ఇండియాలో స్టార్ హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు వేయడం అనేది మామూలే. అయితే ఒక పరభాషా నటుడి సినిమాకు స్పెషల్ షోస్ అంటే మాములు విషయం కాదు. అందులోనూ 30 స్పెషల్ షోస్ అంటే అది కచ్చితంగా రేర్ ఫీట్ అనే చెప్పాలి.

అల వైకుంఠపురములో చిత్రంలో కూడా కేరళ ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు బానే ఉన్నాయి. జయరామ్ అక్కడ ప్రముఖ నటుడు, ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే జీపీ కూడా. విలన్ గా చేసిన సముద్రఖని కూడా మలయాళ ప్రేక్షకులకు పరిచయమే. దీంతో బన్నీతో పాటు పలు తెల్సిన ముఖాలు ఉండడం కచ్చితంగా కలిసొచ్చే అంశమే. మరి అల వైకుంఠపురములో చిత్రం ద్వారా బన్నీ అక్కడ ఏ విధమైన హంగామా చేయనున్నాడో చూడాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2T6Hp8L

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...