`మిస్టర్ మజ్ను` ఫలితం నిరాశపరిచింది. దీంతో ఆలోచనలో పడ్డ అఖిల్ తదుపరి చిత్రాన్ని చాలా సైలెంట్‌గా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ లవ్ స్టోరీ చేస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యార్‌పై ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో వుంది. సైలెంట్‌గా పనిచేసుకుపోతున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
ఇదిలా వుంటే ఈ సినిమా చిత్రీకరణ దశలో వుండగానే అఖిల్ మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టినట్టు తెలిసింది. `గద్దకొండ గణేష్`తో సక్సెస్ అందుకున్న దర్శకుడు హరీష్‌శంకర్ త్వరలో మరో చిత్రాన్ని మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అఖిల్ హీరోగా నటించే అవకాశాలే ఎక్కువగా వున్నాయని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
అయితే కొంత మంది మాత్రం స్టార్ డైరెక్టర్‌ల తరహాలోనే హరీష్ శంకర్ స్టార్ హీరో కోసం చూస్తున్నారని, పవన్‌తో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై హరీష్‌శంకర్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి అంటున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2vnBdiT
Comments
Post a Comment