కొత్త తరహా చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు ఎస్.జె. సూర్య. తెలుగు, తమిళ భాషల్లో ఆయన చేసిన వాలి, సూర్య చిత్రాలు దర్శకుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దర్శకుడిగా, హీరోగా, విలన్‌గా త్రిపాత్రాభినయం చేస్తున్న ఆయన మీడియాపై మండిపడుతున్నారు. తనతో కలిసి `మాన్‌స్టర్` చిత్రంలో నటించిన ప్రియా భవానీ శంకర్‌కి ఎస్.జె. సూర్య కొన్ని రోజుల క్రితం ప్రపోజ్ చేశారట. అందుకు ఆమె తిరస్కరించిందని గత కొన్ని రోజులుగా తమిళ మీడియాలో వరుస కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపై సూర్య ఘాటుగా స్పందించారు.
దర్శకుడిగా, హీరోగా, విలన్‌గా ఆయన నటించిన చిత్రాలు తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. మెర్సల్, స్పైడర్ వంటి చిత్రాల్లో ఎస్.జె. సూర్య విలన్‌గా నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై సోషల్ మీడియాలో రూమర్స్ వెల్లువెత్తడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. తనపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
కొందరు వ్యక్తులు పనిగట్టుకుని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రియాభవానీ శంకర్‌కు తాను ప్రపోజ్ చేస్తే ఆమె తిరస్కరించారంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయని, ఆధారాలు లేని అసత్య వార్తల్ని ప్రచారం చేయొద్దంటూ ఘాటుగా స్పందించారు. ప్రియాభవానీ శంకర్, తను `మాన్‌స్టర్` సినిమా నుంచి మంచి స్నేహితులం అని, అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని, ఈ విషయం గురించి దయచేసి విసిగించకండని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36YKjR9
Comments
Post a Comment