బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ఖాన్. హిందీ చిత్రాల్లో తనదైన మార్కు నటనతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన హిందీతో పాటు తెలుగు, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించారు. తెలుగులో మహేష్ నటించిన `సైనికుడు` చిత్రంలో ఇర్ఫాన్‌ఖాన్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇటీవల అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడిన ఆయన చికిత్స కోసం లండన్ వెళ్లి వచ్చారు కూడా.
తిరగి తను అంగీకరించిన చిత్రాల్ని వరుసగా పూర్తి చేస్తూ వస్తున్న ఆయన తాజాగా మళ్లీ అనారోగ్యానికి గురికావడం బాలీవుడ్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్‌ఖాన్ తాజాగా ఆ వ్యాధి తిరగదోడటంతో అనారోగ్యానికి గురయ్యారట. దీంతో ఆయన షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇర్ఫాన్ `హిందీ మీడియం` కు సీక్వెల్ గా రూపొందుతున్న `అంగ్రేజీ మీడియం` చిత్రంలో నటిస్తున్నారు. హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్నారు. రాధికా మదన్, కరీనాకపూర్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మార్చి 20న చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఇర్ఫాన్ కారణంగా షూటింగ్ ఆలస్యమైతే మాత్రం `అంగ్రేజీ మీడియం` రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2t7FkPe
Comments
Post a Comment