`ఛలో` సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్న. అందంతో పాటు అభినయంతో టాలీవుడ్ ఆడియన్స్‌ని రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. ఈ సినిమా తరువాత `గీత గోవిందం` హిట్‌తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన రష్మిక టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లతో బిజీగా వున్న ఆమె ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న `భీష్మ`తో పాటు సూపర్‌స్టార్ మహేష్, అనిల్ రావిపూడిల తొలి కలయికలతో వస్తున్న `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటిస్తోంది. ఈ సినిశానని, తను మా సంక్రాంతి బరిలో ఈ నెల 11న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన రష్మిక `సరిలేరు నీకెవ్వరు` సినిమా గురించి పలు ఆసక్తికర విషయాల్ని బయటపెట్టింది. షూటింగ్ దర్శకుడు అనిల్ రావిపూడితో పోటీపడ్డానని, వెల్లడించిన రష్మిక దేన్నైనా ఇట్టే క్యాప్షర్ చేసేస్తానని, చిత్రీకరణ సమయంలో అనిల్ ఏది చెప్పినా వెంటనే చేసే ఈ విషయంలో తనకు మించిన కాపీ క్యాట్‌లు మరెవరూ లేరని చెప్పుకొచ్చింది. సెట్‌లో హీరో మహేష్ సైలెంట్‌గా వుంటే తనే వెళ్లి డిస్ట్రబ్ చేసేదాన్నని, ఆయన తాను నటించిన ఛలో, గీత గోవిందం, డియర్ కాంమ్రేడ్` చిత్రాలు చూశారని వెల్లడించింది.
సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ చాలా రోజుల తరువాత తనకు ఫుల్ లెంగ్త్ కామెడీ చేసే అవాకాశం ఈ సినిమాలో దక్కిందని పోర్కొంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌లో రష్మిక పాత్ర ఏ స్థాయిలో రచ్చ చేయబోతోందో అర్థమవుతోంది. `అర్థమవుతోందా… ` అనే మేనరిజమ్‌తో తనదైన మార్కు కామెడీతో ఎంటర్‌టైన్ చేయబోతోంది. రష్మిక కెరీర్ ఈ సినిమాతో కొత్త మలుపు తిరిగే అవకాశం వుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2N3Aqtl
Comments
Post a Comment