అభివృద్ధి అనే పేరుతో ప్రకృతి వనరులను కొంతమంది స్వార్ధపరుల చేతులకు అప్పగించి, వాళ్ళు వాటికి వెల కట్టి అమ్ముతుంటే, ఆ చర్యలను పరోక్షంగా ప్రోత్సహిస్తూ, తర్వాత ప్రజలకు ఉచితమనే పేరుతో యాచకత్వ ధోరణిని, బానిసలను దశాబ్దాలుగా తయారుచేస్తూ ఉన్నారు; మన ప్రియమైన రాజకీయనాయకులు. జీవనదులు పారే ఈ దేశంలో మంచినీళ్ళు సైతం డబ్బులు పెట్టి కొనుక్కునే స్థాయికి తీసుకొచ్చారు వీళ్ళు. ఇప్పుడు ఆలాంటి పోరాట నేపధ్యంలో వచ్చిన సినిమా “బూమరాంగ్”. గత ఏడాది తమిళంలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన సినిమా ఇది. “గద్దలకొండ గణేష్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అధర్వ మురళి ఈ సినిమాలో హీరోగా నటించారు. ఆర్.కన్నన్ ఈ సినిమా దర్శకుడు. అర్జున్ రెడ్డి సినిమాకు సంగీతం అందించిన “రధాన్” ఈ సినిమాకు పనిచేసారు.
యువతరం తలుచుకుంటే ఈ సమజంలో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఈ సినిమాలో చూపించామని చిత్ర టీం చెప్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాకి సస్పెన్స్ అంశాలు బలమని వెల్లడించారు. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో రిలీజ్ చేసిన ప్రచార చిత్రాల పట్ల మంచి స్పందన వస్తోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SSumr8
Comments
Post a Comment