సాగర తీరానా సంధ్యా సమయానా నువ్వు నేనూ అని ప్రేమికుల కోసం పాటకట్టడో సినీ కవి. అది తన కోసమే అన్నట్టుగా సంధ్యా సమయాన సాగర తీరానా బికినీ ధరించి హల్‌చల్ చేస్తోంది రకుల్ ప్రీత్‌సింగ్. తెలుగు లో సినిమాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ చిత్రాలపై దృష్టిపెట్టిన ఈ అమ్మడు షూటింగ్ ల మధ్య చిన్న విరామం దొరకడంతో వెకేషన్‌కి వెళ్లింది. అక్కడి బీచుల్లో బికినీ అందాలతో హంగామా చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా వుంటే ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వరుస బ్రాండ్‌లకు బ్రాండ్ అబాసిడర్‌గా చకచకా సైన్‌లు చేసేస్తోంది. ఇంత బిజీగా వున్నా ఫిట్ నెస్‌ని మాత్రం ఎక్కడా మిస్ కావడం లేదు. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గినా బాలీవుడ్‌లో మాత్రం వరుస ఆఫర్లని సొంతం చేసుకుంటోంది. తాజాగా బాలీవుడ్‌లో మరో చిత్రాన్నితన ఖాతాలో వేసుకుంది. జాన్ అడ్రహం హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని `ఎటాక్` పేరుతో నిర్మిస్తున్నారు. లక్ష్య రాజ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది.
ఈ సినిమాతో పాటు తమిళంలో కమల్‌హాసన్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న `ఇండియన్ 2`, శివకార్తికేయన్ చిత్రాల్లో నటిస్తోంది. మళ్లీ తెలుగులో రకుల్ టైమ్ స్టార్ట్ కావాలంటే `ఇండియన్ 2` బ్లాక్ బస్టర్‌గా నిలవాల్సిందే. అందుకే ఈ సినిమాపై రకుల్ భారీ అంచనాలు పెట్టుకుందట. చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా అధినేత అల్లిరాజా సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
Credit: Instagram
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FEgh91
throwback #ibizadiaries #beachbum #dreamer #gypsy
Comments
Post a Comment