తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన నటించిన `రాక్షసన్` తెలుగులో `రాక్షసుడు` పేరుతో రీమేక్ అయి ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నటి రజినితో విడాకులు తీసుకున్న విష్ణు విశాల్ గత కొంత కాలంగా హైదరాబాద్ బ్యాడ్మంటన్ స్టార్ గుత్తా జ్వాలాతో సన్నిహితంగా వుంటున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ఆ మధ్య గుత్తా జ్వాల పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చిన విశాల్ గుత్తా, ఆమె స్నేహితులతో కలిసి హంగామా చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఈ విషయంపై విష్ణు విశాల్‌ని ఆరాతీస్తే మాత్రం గుత్తా జ్వాల తనకు ఫ్రెండ్ మాత్రమే నని, తన స్నేహితుడిగానే అందరితో కలిసి బర్త్‌డే పార్టీలో పాల్గొన్నానని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని వివరణ ఇచ్చాడు. అయితే తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో గుత్తాతో కలిసి పాల్గొన్న విశాల్ ఆ ఫొటోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ `ఇది మాకు సంతోషకరమైన సంవత్సరం` అని పోస్ట్ చేయడం పలువురిని ఆకట్టుకుంటోంది.
గత కొంత కాలంగా డేటింగ్ లో వుంటూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట న్యూ ఇయర్ సందర్భంగా తమ మధ్య వున్న అనుబంధాన్ని ఇండైరెక్ట్‌గా వెల్లడించి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం ఆసక్తికరంగా మారింది. జగజాల కిల్లాడి, ఎఫ్.ఐ.ఆర్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Happy 2020
pic.twitter.com/1HhAZ57Cl0
— Gutta Jwala (@Guttajwala) December 31, 2019
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36lxxf6
Comments
Post a Comment