ఇలా జరగడం సినిమా చరిత్రలో ఒక అరుదైన సంఘటన. మరొక విశేషం ఏంటంటే సీక్వెల్ చేస్తున్నది మళ్ళీ మామూలు సినిమా కూడా కాదు, అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా. పేరు నేత్రికన్. సినిమాలో హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. అది కూడా డబల్ రోల్. సినిమాకు దర్శకత్వం ఎస్.పి. ముత్తురామన్. ఇంకొక అద్భుతం ఏంటంటే సినిమా నిర్మించింది స్వయానా రజనీకాంత్ గురువు అయిన కె. బాలచందర్ గారు. ఆయనే ఈ సినిమాకు స్వయంగా స్క్రీన్ ప్లే అందించారు. ఇక వుమనైజర్ గా తండ్రి, ఆ తండ్రిని మార్చాలనుకునే కొడుకుగా రజనీకాంత్ నటన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఇక ఇసైజ్ఞాని ఇళయరాజా గారు అందించిన సంగీతం ఈ సినిమాకు మరొక ప్రధాన బలం.
ఇప్పుడు రజనీ అల్లుడు ధనుష్ ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక సినిమాలలో ద్విపాత్రాభినయం చేసి సక్సెస్ అయిన ధనుష్ కి ఈ సినిమా కరెక్ట్ గా స్క్రిప్ట్ లాక్ అయితే కేక్ వాక్ అని చెప్పవచ్చు. ఇంకొక వెరైటీ ఏంటంటే ఈ సినిమాలో ధనుష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్. నేత్రికన్ సినిమాలో రజనీ సరసన కీర్తిసురేష్ తల్లి మేనక హీరోయిన్ గా నటించారు. గతంలో కీర్తి సురేష్ & ధనుష్ కలిసి నటించిన తొడరి (తెలుగులో రైల్) సినిమా హిట్ అయ్యింది. ఇక నేత్రికన్ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TUESPg
Comments
Post a Comment