టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీయెస్ట్ హీరో విజయ్ దేవరకొండ. వరుస హిట్‌లతో దూసుకుపోతున్న ఈ హీరో త్వరలో బాలీవుడ్ బాటపట్టబోతున్నాడు. అందుకు తన కొత్త చిత్రాన్ని ఎంచుకున్నాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా తరువాత స్టైలిష్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తో కలిసి ఓ భారీ చిత్రం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ రూపొందిస్తూ చార్మితో కలిసి నిర్మించనున్న ఈ చిత్రానికి `ఫైటర్` అనే టైటిల్‌ని ఖరారు చేశారు,
ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా పలకరించబోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్‌జోహార్‌ని రంగంలోకి దింపిన పూరి, చార్మి చకచకా పావులు కదుపుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్నితెరపైకి తీసుకురావాలన్నది పూరి, విజయ్ దేవరకొండల ప్లాన్. అందుకు తగ్గట్టుగానే క్రేజీ కాస్టింగ్‌ని ఈ సినిమాకు యాడ్ చేస్తున్న పూరి ఈ సినిమా కోసం 25 కోట్లు బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు పూరి కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ కావడంతో అంతా అవాక్కవుతున్నారట.
ఈ సినిమా కోసం ఇప్పటికే రమ్యకృష్ణని కీలక పాత్ర కోసం ఎంపిక చేసిన పూరి మరో కీలక పాత్ర కోసం బాక్సర్ టైసన్‌ని సంప్రదిస్తున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. టైసన్ కూడా ఇటీవలే పూరికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే విజయ్ `ఫైటర్` పాన్ ఇండియా సినిమా కావడం ఖాయం అని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35K0hNf
Comments
Post a Comment