సినిమాలో నటించినా కూడా ఫైనల్ గా స్క్రీన్ మీద చూసుకునే వరకూ తమ ట్రాక్ ఉందో లేదో తెలియని పరిస్థితి కొన్ని సార్లు వస్తుంది. కావాలని చేయరు కానీ ఒక్కోసారి సినిమా మంచి కోసం కొందరి సీన్స్ ను లేపేయాల్సి వస్తుంది. ఆ విషయంలో ఎవరూ చేసేదేం ఉండదు. ఇప్పుడు కమెడియన్ షకలక శంకర్ పరిస్థితి కూడా ఇలాంటిదే. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో షకలక శంకర్ కమెడియన్ గా ఒక మంచి పాత్ర వేసాడు. సినిమా కథతో సంబంధం లేకుండా ఉండే ఒక సెపరేట్ ట్రాక్ అది. కామెడీ కూడా బాగా పండిందట. కాకపొతే సినిమా రన్ టైమ్ కు అడ్డొస్తోందనో లేక అప్పటికే కామెడీ బాగానే వర్కౌట్ అయిందనో కారణంతో ఇప్పుడు షకలక శంకర్ కామెడీ ట్రాక్ మొత్తానికి లేపేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత అనిల్ సుంకర ఇటీవలే మీడియాతో పలు విషయాలు ముచ్చటించిన సందర్భంగా రివీల్ చేసాడు.
“కథలో భాగంగా వచ్చే సత్య కామెడీ ట్రాక్ చాలా బాగా వచ్చింది. దాంతో షకలక శంకర్ కామెడీ ట్రాక్ అవసరం లేదని భావించాం. ఆ ట్రాక్ కథకు అసలు సంబంధం ఉండదు” అని నిర్మాత ప్రకటించాడు. అయితే ఈ కామెడీ ట్రాక్ మొత్తం లేపేసినా కానీ సరిలేరు నీకెవ్వరు రన్ టైమ్ 2 గంటల 48 నిముషాలు వచ్చినట్లు సమాచారం. అయితే అంత రన్ టైమ్ ఉన్నా కానీ ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీలవ్వరని అంటున్నారు చిత్ర యూనిట్. ముఖ్యంగా 30 నిమిషాల పాటు వచ్చే ట్రైన్ ఎపిసోడ్ బాగా పేలుతుందని వారు నమ్ముతున్నారు. అనిల్ రావిపూడి గత సినిమాల్లాగే ఇందులో కూడా కామెడీనే మెయిన్ అట్రాక్షన్ అవుతుందని, దాంతో పాటు మహేష్ బాబు స్క్రీన్ ప్రెజన్స్, ఫైట్స్, డైలాగ్స్ కూడా బాగా వర్కౌట్ అవుతుందని అంటున్నారు.
మొత్తంగా చూసుకుంటే సరిలేరు నీకెవ్వరు చిత్రం పండక్కి పెర్ఫెక్ట్ సినిమా అన్నది వాళ్ళ ఉద్దేశం. జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్రం ఈరోజు కానీ రేపు కానీ సెన్సార్ కు వెళ్లనుంది. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ub0ZGu
Comments
Post a Comment