Skip to main content

త్రివిక్రముడు తన స్పీచ్ తో మరోసారి మాయ చేసాడుగా

త్రివిక్రముడు తన స్పీచ్ తో మరోసారి మాయ చేసాడుగా
త్రివిక్రముడు తన స్పీచ్ తో మరోసారి మాయ చేసాడుగా

త్రివిక్రమ్ శ్రీనివాస్ ను మాటల మాంత్రికుడు అంటుంటారు. తన సినిమాల్లోని డైలాగులతో మాయ చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్ బయట ఫంక్షన్ లలో ఇచ్చే స్పీచ్ లతో కూడా అదరగొడుతుంటాడు. అందుకే మాటల మాయావి అని అతనికి పేరు. నిన్న అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్ లో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్పీచ్ తో అందరినీ అలరించాడు. అసలు తన స్పీచ్ మొదలైన విధానమే ఆసక్తికరంగా అక్కడున్న వారితో పాటు లైవ్ లో ఫంక్షన్ ను వీక్షిస్తున్న వారికి కూడా తెగ నచ్చేసింది. “ఒక 10/20 రూమ్ లో, ఒక సోఫా మీద, మధ్యాహ్నం 3 -4 గంటల మధ్య అందరూ మత్తుగా భోజనం చేసి ఉంటున్న వేళలో ఒక 60 ఏళ్ల పెద్దాయనతో ఒక 30 ఏళ్ల కుర్రాడు చేసిన పాట” అంటూ సీతారామశాస్త్రికి, థమన్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన ఇంట్రడక్షన్ ఆదారహో అనే రేంజ్ లో ఉంది.

సామజవరగమన అనే సాంగ్ ఈ సినిమాకి ఎందుకంత స్పెషలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మాటల్లో వ్యక్తపరిచాడు. అలాగే మరోసారి సిరివెన్నెల సీతారామశాస్త్రిపై తనకున్న అభిమానాన్ని తెలియజేసాడు. బన్నీ గురించి ప్రస్తావిస్తూ జులాయి టైమ్ లో పెళ్లికాని యువకుడు, ఇప్పుడు ఇద్దరు పిల్లల తండ్రి.. తన అనుభవం పెరిగింది, మెచ్యూరిటీ పెరిగింది. అందుకే తనని బన్నీ అని అనను, అల్లు అర్జున్ అంటాను అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ స్థాయి గురించి మాట్లాడాడు.

సంగీతంపై తనకున్న ఇష్టాన్ని ఫన్నీగా తెలియజేసాడు. మనసు దురద పెడితే గోక్కునే ఆయుధం సంగీతం అంటూ సంగీతానికి కొత్త, వింతైన అర్ధాన్ని ఇచ్చాడు. తలలో దురద పెడితే దువ్వెన వాడతాం, సంగీతం కూడా మనసుకు దువ్వెన వంటిదే అంటూ అందరినీ నవ్వించాడు. అలాగే సంగీతాన్ని ఒక అందమైన ఆడపిల్లతో పోల్చుతూ తనకు సంగీతమంటే ఎందుకంత మక్కువో అర్ధం చెప్పాడు. తనను అడుగడుగునా ప్రోత్సహించిన నిర్మాతలకు కూడా కృతఙ్ఞతలు తెలిపాడు.

మొత్తంగా అల వైకుంఠపురములో విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు కనిపించాడు. మరి తన కాన్ఫిడెన్స్ నిజమై సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో చూడాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QvvoI5

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...