Skip to main content

అనిల్ రావిపూడి యమ కాన్ఫిడెంట్ గా ఉన్నాడే

Anil Ravipudi super confident on Sarileru Neekevvaru
Anil Ravipudi super confident on Sarileru Neekevvaru

రోజులు దగ్గర పడే కొద్దీ సరిలేరు నీకెవ్వరు చిత్రంపై పాజిటివ్ బజ్ పెరుగుతోంది. ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా పాసివ్ గా కనిపించిన మహేష్ సరిలేరులో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపించనున్నాడని ప్రోమోలను చూస్తే అర్ధమవుతోంది. ఈ చిత్రంపై దర్శకుడు అనిల్ రావిపూడి చాలా కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నాడు. కేవలం తన కెరీర్ లో నాలుగు సినిమాలే చేసిన అనిల్ రావిపూడికి మహేష్ తో సినిమా చేసే అవకాశం చాలా తొందరగా వచ్చింది. అయితే ఈ నాలుగు సినిమాలు చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది. అదే అనిల్ రావిపూడికి ప్రేక్షకుల పల్స్ బాగా తెలుసు. వారేం కోరుకుంటున్నారు అన్నది పసిగట్టడంలో అనిల్ రావిపూడి దిట్ట. ముఖ్యంగా కామెడీని తన సినిమాలకు కవచంలా వాడుకున్నాడు. తన నాలుగు సినిమాల్లో వీక్ లింక్ అయిన రాజా ది గ్రేట్ లో కూడా కామెడీకి లోటుండదు.

సరిలేరు నీకెవ్వరు టాప్ హీరో సినిమా కాబట్టి కేవలం కామెడీ మీదే దృష్టి పెడితే సరిపోదు, యాక్షన్ ఘట్టాలు, ఎమోషనల్ సీన్లు అంటూ కొంత పెట్టినా సరిలేరులో కూడా కామెడీకి లోటు ఉండదని సమాచారం. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ ఏకంగా 40 నిమిషాల పాటు ఉంటుందిట. ఈ ఎపిసోడ్ మొదలైన దగ్గరనుండి పూర్తయ్యేవరకూ నవ్వుతూనే ఉంటామని అంటున్నారు. అలాగే ఇందులోనే ఒక ఫైట్, పాట కూడా వస్తుందని సమాచారం.

ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో సెకండ్ హాఫ్ అన్నది వీక్ లింక్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ను హిలేరియస్ గా మలిచే అనిల్ రావిపూడి, సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం తడబడుతూ ఉంటాడు. నాలుగు సినిమాలకూ ఇది జరిగింది. అయితే ఆ తప్పు సరిలేరుకి జరగకుండా జాగ్రత్తపడ్డాడు అనిల్ రావిపూడి. ఇప్పటిదాకా ఈ దర్శకుడి గురి తప్పింది లేదు. తన అంచనాలు అన్ని సార్లు నిజమయ్యాయి. సరిలేరు నీకెవ్వరు విషయంలో కూడా అదే జరిగే అవకాశముంది. ఇక సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా ఉండడంతో మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35nn6q2

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...