కోలీవుడ్‌లో హీరో విజయ్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల ఆయన నటించిన మెర్సల్, సర్కార్, బిగిల్ వరుస విజయాల్ని సాధించి వసూళ్ల వర్షాన్ని కురిపించాయి. దీంతో విజయ్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అంతకు ముందు ఒక సినిమాకి 20 నుంచి 25 కోట్లు తీసుకుంటూ వస్తున్న విజయ్ `బిగిల్` చిత్రానికి మాత్రం 35 నుంచి 40 వరకు తీసుకున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా తరువాత `ఖైదీ` ఫేమ్ లోకేష్ కనకరాజ్‌తో విజయ్ ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.
`మాస్టర్` పేరుతో నిర్మాణం జరుపుకుంటున్నఈ చిత్రంలోని కీలక పాత్రలో మక్కల్ సెల్వన్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో వుంది. ఈ చిత్రం తరువాత విజయ్ సన్ పిక్చర్స్ నిర్మించనున్న చిత్రాన్ని అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఈ చిత్రానికి పారితోషికం కింద భారీ మొత్తం తీసుకుంటున్నారని, గత చిత్రాలకు మించి తీసుకోబోతున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కోలీవుడ్ మీడియా దాదాపు వంద కోట్ల వరకు పారితోషికం తీసుకోబోతున్నారని, అందులో 50 ఇప్పటికే తీసుకున్నారని తాజాగా ప్రచారం జరుగుతోంది.
`మాస్టర్` తరువాత తెరపైకి రాబోతున్న ఈ చిత్రానికి `అసురన్` ఫేమ్ వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నారు. `బాహుబలి` తరువాత దక్షిణాది చిత్రాలపై దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడటంతో విజయ్, వెట్రిమారన్‌ల కలయికలో రానున్న చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారట. దీంతో దీనికి తగ్గట్టుగానే విజయ్ తన పారితోషికాన్ని పెంచారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35wYtHC
Comments
Post a Comment