విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం `డియర్ కామ్రేడ్` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా రౌడీ హీరో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో `వరల్డ్ ఫేమస్ లవర్`గా ఫిబ్రవరిలో రచ్చకు రెడీ అయిపోతున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా రిలీజ్ ముందే కొత్త చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. స్టైలిష్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ ఓ చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. `ఫైటర్` పేరుతో తెరపైకి రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించాలని పూరి, ఛర్మి ప్లాన్స్ చేస్తున్నారు.
తెలుగు, తమిళ. హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. సంక్రాంతి తరువాత ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పటికే ఈ సినిమా కోసం బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్‌జోహార్‌ని రంగంలోకి దింపారట. ఇటీవలే ఆయనతో చర్చలు జరిపిన చిత్ర బృందం ఫైనల్‌గా ఆయనతో ఓకే అనిపించుకున్నట్టు తెలిసింది.
ఇక ఈ సినిమాలో ఫైటర్‌గా విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన లుక్‌ని తాజాగా ఫైనల్ చేశామని ఛార్మి వెల్లడించింది. ముంబైకి చెందిన ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీం ఈ లుక్‌ని డిజైన్ చేశారట. గతంలో ప్రభాస్ లుక్‌ని, ఇటీవల `ఆర్ ఆర్ ఆర్` చిత్రానికి గానూ రామ్‌చరణ్ లుక్‌ని డిజైన్ చేసిన ఆయన `ఫైటర్` సినిమా కోసం విజయ్ దేవరకొండ లుక్‌ను డిజైన్ చేయడం ప్రధాన్యతను సంతరించుకుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QpxTM5
Comments
Post a Comment