రజనీకాంత్.. ఈ పేరు తెరపైన కనిపిస్తే.. మెరుపులు.. సరికొత్త మేనరిజమ్స్ సగటు ప్రేక్షకుడి మదిలో తళుక్కున మెరుస్తాయి. అంతగా రజనీ మేనియా ప్రేక్షకుల్ని ఆవహించింది. అయితే ఆ స్థాయి మేనరిజమ్స్, మెరుపులు, రజనీ మార్కు జలక్కులతో సినిమా వచ్చి చాలా కాలమే అవుతోంది. `రోబో` తరువాత గత 9 ఏళ్లుగా రజనీ మెరుపుల కోసం, ఆయన మార్కు సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ కళని `దర్బార్` నిజం చేసింది.
ఏడుపదుల వయసులో వున్నా సినిమాలో మాత్రం రజనీ నాలుగు పదులు దాటిన యువకుడి తరహాలో మెరుపు వేగంతో నటించిన తీరుకు రజనీ అభిమానులు ఆనందంతో పండగా చేసుకుంటున్నారు. 15 ఏళ్లు రజనీ కోసం ఎదురుచూసిన మురుగదాస్ ఎలాంటి సినిమా ఇవ్వాలో అలాంటి చిత్రాన్ని రజనీ అభిమానులకు అందించారు. సినిమాలో 30 ఏళ్లు తగ్గించుకుని రజనీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తొలి షో నుంచే హిట్ టాక్‌ని సొంతం చేసుకున్న `దర్బార్` తాజాగా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.
తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 50 కోట్లు వసూళ్లని సాధించిన ఈ చిత్రం రెండవ రోజు కూడా అదే ఊపుని కొనసాగించి వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. పండగ సీజన్ కావడంతో ఈ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు పోటీగా వచ్చిన బాలీవుడ్ చిత్రాలు తాన్హాజీ, ఛపాక్ ఆశించిన స్థాయిలో ప్రభావాన్ని చూపించకపోవడంతో `దర్బార్` అక్కడ కూడా కలెక్షన్స్ కుమ్మేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2R6epLx
Comments
Post a Comment