తమిళ స్టార్ హీరో సూర్య కేవలం తెర మీదే కాదు, నిజజీవితంలో కూడా హీరోనే. ఎందుకంటే కేవలం “ఆ పూట ఆకలి తీర్చే అన్నదానం కన్నా, అందరికీ అన్నం వెట్టే విద్య దానం మిన్న” అనే సూక్తి ని పాటిస్తూ తన సేవా సంస్థ “అగరం ఫౌండేషన్” ద్వారా అనేక మంది పేద విద్యార్ధులకు చదువు చెప్పిస్తున్నాడు.
ఇటీవల ఈ సంస్థకు సంబంధించిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఒక గంభీరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సభలో గాయత్రి అనే ఒక అమ్మాయి మాట్లాడిన తీరుకి సూర్య తో సహా, అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ అమ్మాయి తన గురించి చెప్తూ, “తన తండ్రి ఒక వ్యవసాయ కూలీ అని, అందులోను ఆయనకు అనారోగ్యం అని, అగరం ఫౌండేషన్ వల్ల తను చదువుకుని, ఇప్పుడు ఇంగ్లీష్ ట్రైనర్ గా పనిచేస్తున్నాని, ఇంగ్లీష్ మాట్లాడితే చాలు అన్న తనను ఇంగ్లీష్ ట్రైనర్ ని చేసినందుకు ధన్యవాదాలు”అని చెప్పగా, సూర్య వెంటనే లేచి, ఆమె దగ్గరకు వెళ్లి దగ్గరకు తీసుకున్నారు. భావోద్వేగంతో ఒక్కసారి అందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతూ “భావానికి బాషతో సంబంధం లేదని” నిరూపిస్తోంది.
• @Suriya_offl
I can’t express in words | #SURIYA – the HUMANITARIAN#Agaram
pic.twitter.com/GTBYCA7O1H
— Surya Fans Club
(@SuriyaFansClub) January 5, 2020
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SVkXPT

I can’t express in words |
(@SuriyaFansClub)
Comments
Post a Comment