కన్నడ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ తెలుగులో రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మంచి క్రేజ్‌నే సొంతం చేసుకుంది. ఆ తరువాత `గీత గోవిందం`, డియర్ కామ్రేడ్ తాజాగా `సరిలేరు నీకెవ్వరు` చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల్ని తన ఖాతాలో వేసుకుంటోంది. `వినబడుతోందా? అంటూ ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టేస్తున్న రష్మిక తన అందం వెనకున్న అసలు రహస్యాన్ని బయట పెట్టేసింది.
`సరిలేరు నీకెవ్వురు` సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించిన ఆమె తన డైట్ ప్లాన్‌ని, తన అందం వెనకున్న అసల సీక్రెట్‌ని బయటపెట్టేసింది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే వాటర్ ఎక్కువగా తాగడానికి ఇష్టపడతానని, కనీసం లీటర్ వాటర్ తీసుకుంటానని చెప్పేసింది. తన డైటీషియన్ యాపిల్ సిడెర్ వెనిగర్ వాడమని సలహా ఇచ్చారట.
ఇటీవలే తను షాకాహారిగా మారారట. అయితే కూరగాయలు తినడానికి ఇష్టపడనని, దోసకాయలు, బంగాళాదుంప, క్యాప్సికమ్ అంటే తనకు నచ్చవని, వెజిటేరియన్‌గా మారాక ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం ఇటీలీ వెళ్లానని, అక్కడి షాకాహారం తినలేక ఐస్ క్రీమ్‌లతోనే ఆకలి తీర్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/30mH5En
Comments
Post a Comment