Skip to main content

సినిమా ప్రమోషన్లకు ఉదాహరణగా మారుతున్న మహేష్ బాబు

Mahesh promoting Sarileru Neekevvaru on next level
Mahesh promoting Sarileru Neekevvaru on next level

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పుడు ఎలా ఉండేవాడో అందరికీ తెలుసు. ఎంత రిజర్వ్డ్ గా ఉండేవాడో అందరం చూసాం. తన సినిమా ఫంక్షన్ లకు, విజయోత్సవ వేడుకలకు కూడా హాజరవ్వడానికి మొహమాట పడేవాడు. అయితే శ్రీమంతుడు నుండి మహేష్ లో చాలా మార్పు వచ్చింది. దానికి నమ్రత కారణం కావొచ్చు లేదా మరేదైనా కారణం కావొచ్చు కానీ మహేష్ లో మార్పు అయితే స్పష్టంగా కనిపించింది. తన సినిమాలను ప్రమోట్ చేసుకునే తీరులో కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు.

ఇటీవలే మహర్షి సినిమాను ప్రమోట్ చేసుకునే విధానం ఎలా ఉందో అందరం చూసాం. నిజానికి మహర్షి చిత్రానికి సూపర్ పాజిటివ్ టాక్ ఏం రాలేదు. బోరింగ్ సినిమా అనే అన్నారు. అయితే మహేష్ మాత్రం ఎక్కడా నిరుత్సాహపడలేదు. తన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే వరకూ ఎక్కడా విశ్రమించలేదు. మొత్తానికి మహర్షి చిత్రాన్ని హిట్ అనిపించాడు.

ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రం విషయానికి వచ్చేసరికి మహేష్ మరింత ముదిరిపోయాడు. సినిమా విడుదలకు వారం రోజుల నుండి మొదలుపెట్టిన మహేష్, సినిమా విడుదలై వారం అవుతున్నా ఎక్కడా ఆపలేదు. ఏ రోజు చూసినా ఎక్కడో ఒక చోట సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. నిన్న సక్సెస్ సెలబ్రేషన్స్ చేసిన మహేష్, ఈరోజు తన కూతురు ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. సినిమా విడుదలకు ముందు తర్వాత మీడియాకు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడో లెక్కే లేదు. ట్విట్టర్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టాడు. అలాగే నిన్న ఫేస్ బుక్ లో గంట పాటు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

పోటీగా అల వైకుంఠపురములో దున్నేస్తుండడంతో మహేష్ ఎక్కడా విశ్రమించట్లేదు. తన సినిమా ప్రమోషన్స్ కు పనికొచ్చే ఏ మాద్యమాన్నీ వదిలిపెట్టట్లేదు. ఇది చూసిన ఎవరైనా మిగతా హీరోలు మహేష్ ను చూసి ఎంతైనా నేర్చుకోవచ్చు అని సలహాలు కూడా ఇస్తున్నారు అంటే చూసుకోండి మహేష్ ఎంతలా మారిపోయాడో.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2v1W9M8

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...