సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం గురించి రోజుకో కొత్త న్యూస్ బయటకు వస్తోంది. సాధారణంగా మహేష్ సినిమాకు రిలీజ్ ముందర జరిగే హంగామానే వేరు. అయితే మహేష్ ఈ మధ్య అన్నీ సాఫ్ట్ అండ్ అతి మంచి వాడి రోల్స్ వేసిన నేపథ్యంలో ప్రస్తుతం చేసిన సరిలేరు నీకెవ్వరు ఒక వెల్కమ్ చేంజ్ గా చెప్పొచ్చు. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ గా కనిపిస్తున్నా కానీ దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా మాస్ క్యారెక్టర్ మహేష్ చేత వేయించాడని అర్ధమవుతోంది. మహేష్ ను ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా ఆ విధంగా మహేష్ లుక్ ను, డైలాగ్స్ ను, మ్యానరిజమ్స్ ను మార్చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మహేష్ ఈ సినిమాలో డ్యాన్స్ వేయాల్సిందేనని దర్శకుడు పట్టుబట్టినట్లు వార్తలు వచ్చాయి. గత కొన్ని చిత్రాలుగా మహేష్ డ్యాన్స్ విషయంలో ఏదో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నాడు. దర్శకులు పట్టుబట్టట్లేదో లేదా మహేష్ ఆసక్తి చూపించట్లేదో కానీ మహేష్ మాత్రం గత కొద్ది సినిమాలుగా డ్యాన్స్ చేయడం బాగా తగ్గించేసాడు.
అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి ఆ లోటుని తీర్చాలని పూనుకున్నాడు. ఇందులో రెండు మాస్ బీట్స్ దేవి శ్రీ ప్రసాద్ చేత కొట్టించాడు. మహేష్ ఈ రెండు పాటలలో డ్యాన్స్ ఇరగదీశాడని సమాచారం. అయితే మహేష్ ఈ చిత్రంలో డ్యాన్స్ కుమ్మేసాడని అన్నప్పుడు చాలా మంది నమ్మలేదు. ఏదో ఫ్యాన్స్ కు సర్దిచెప్పడానికి అలా వార్తలు పుట్టించారు అని భావించారు. అయితే రీసెంట్ గా విడుదలైన డాంగ్ డాంగ్ సాంగ్ ప్రోమోలో మహేష్ డ్యాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మహేష్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మహేష్ ఏదో విపరీతమైన స్టెప్స్ వేసేశాడని కాదు కానీ చాలా కాలం తర్వాత చాలా చలాకీగా కనిపించాడు.
అయితే ఈ పాటను మించి మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్ లో డ్యాన్స్ చేసాడని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. దీనికి శాంపిల్ లాగా అన్నట్లుగా సోషల్ మీడియాలో లీకైన ఒక పిక్ ఇప్పుడు బాగా హల్చల్ చేస్తోంది. ఇందులో మహేష్ మాస్ గెటప్ లో లుంగీ కట్టి ఇరగదీసాడు. శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీలో రష్మికకు ఏదో సూచనలిస్తుండగా మహేష్ శ్రద్ధగా వింటున్నాడు. ఈ మైండ్ బ్లాక్ సాంగ్ ను భారీ సెట్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సినిమాలో ఈ పాట హైలైట్స్ లో ఒకటిగా నిలవనుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2MS4VlR
Comments
Post a Comment