క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు కృష్ణుడు. ఆయన ఇటీవల వైఎస్సార్సీపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల వేళ ఆ పార్టీకి ప్రచారం చేశారు. ఆయన ఇంట్లో నేడు విషాదం చోటు చేసుకుంది. కృష్ణుడి తండ్రి అల్లూరి సీతారామరాజు ఈ రోజు ఉదయం కన్నమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భీమవరం ఆసుపత్రితో చికిత్సపొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు.
కృష్ణుడి తండ్రి మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపాన్నివ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో కృష్ణుడు చిన్ని ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లతో ఆకట్టుకున్న కృష్ణుడు `వినాయకుడు` చిత్రంతో హీరోగా మారిన విషయం తెలిసిందే. ఆ తరువాత హీరోగా వరుస చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tQ61Id
Comments
Post a Comment